Xiaomi India | షియోమి ఇండియా ఉద్యోగులపై వేటు : మార్కెట్ వాటా పతనంతో టెకీల్లో గుబులు
షియోమి ఇండియా (Xiaomi India) మార్కెట్ వాటా తగ్గుముఖం పట్టడంతో కార్యకలాపాల పునర్వ్యవస్ధీకరణలో భాగంగా ఉద్యోగులపై వేటు వేసేందుకు సన్నద్ధమైంది.
న్యూఢిల్లీ : షియోమి ఇండియా (Xiaomi India) మార్కెట్ వాటా తగ్గుముఖం పట్టడంతో కార్యకలాపాల పునర్వ్యవస్ధీకరణలో భాగంగా ఉద్యోగులపై వేటు వేసేందుకు సన్నద్ధమైంది. భారత్‌లో పలువురు కంపెనీ ఉద్యోగులను తొలగించేందుకు షియోమి కసరత్తు సాగిస్తున్నట్టు సమాచారం. గత కొద్ది వారాల్లో షియోమి ఇండియాలో దాదాపు 30 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించారని, మరికొంత మందికి త్వరలోనే పింక్ స్లిప్‌లు అందనున్నాయని చెబుతున్నారు.
ఈ ఏడాది ఆరంభంలో షియామి ఇండియాలో దాదాపు 1500 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా ఈ సంఖ్యను 1000లోపు తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది. దీంతో షియోమి ఇండియాలో మాస్ లేఆఫ్స్ తప్పవనే ఆందోళన వ్యక్తమవుతోంది. పరిస్ధితులకు అనుగుణంగా సిబ్బంది సంఖ్యను కుదించడం వంటి అంశాలపై భారత్ అధికారులే నిర్ణయం తీసుకుంటారని షియోమి ప్రతినిధి పేర్కొన్నట్టు ఓ వాణిజ్య పత్రిక పేర్కొంది. మార్కెట్ వాటా, వ్యాపార అంచనాలకు అనుగుణంగా ఇతర కంపెనీల మాదిరే తామూ ఉద్యోగుల సంఖ్యపై నిర్ణయం తీసుకుంటామని కంపెనీ ప్రతినిధి వెల్లడించారు.
ఇక గత రెండు క్వార్టర్లలో కంపెనీ మార్కెట్ వాటా పతనం కావడంతో షియోమి ఉద్యోగులపై వేటు వేస్తుందనే ఆందోళన సిబ్బందిలో వ్యక్తమవుతోంది. ఇక ఈ ఏడాది ఆరంభంలో తొమ్మిదేండ్ల పాటు కంపెనీతో అనుబంధం కలిగిన షియోమి గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ మను కుమార్ జైన్ టెక్ దిగ్గజానికి గుడ్‌బై చెప్పారు.
Read More :
ChatGPT | ఇక టీచర్ కొలువులకూ చాట్‌జీపీటీ ఎసరు..ఏఐ టూల్స్‌పై హార్వర్డ్ వర్సిటీ కీలక నిర్ణయం
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
attack on bus | జమ్ముకశ్మీర్ బస్సుపై రాళ్లతో దాడి.. డ్రైవర్‌ను ఉగ్రవాదిగా పేర్కొన్న వ్యక్తులు
BRS Leaders | కష్ట కాలంలో అండగా బీఆర్ఎస్.. అధినాయకులపై ప్రత్యేక అభిమానం చాటుకుంటున్న రవీందర్
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

