న్యూయార్క్ : చాట్‌జీపీటీ (ChatGPT) వంటి ఏఐ టూల్స్ రాకతో కొలువుల కోత తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పలు కంపెనీలు చాట్‌జీపీటీ సేవలను వినియోగిస్తుండటంతో ఎన్నో ఉద్యోగాలు కనమరుగవుతున్న ఉదంతాలు వెల్లడవుతుండగా తాజాగా న్యూ టెక్నాలజీ టీచర్లనూ రీప్లేస్ చేయనుంది.
హార్వర్డ్ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ బోధించేందుకు ఏఐ చాట్‌బాట్‌ను రిక్రూట్ చేసుకోవాలని కసరత్తు సాగిస్తోంది. చాట్‌జీపీటీ నైపుణ్యాలు కలిగిన ఏఐ చాట్‌బాట్‌ను ఇన్‌స్ట్రక్టర్‌గా నియమించుకునేందుకు వర్సిటీ సన్నద్ధమైంది. ఓపెన్ఏఐ అడ్వాన్స్డ్ 3.5, జీపీటీ 4 మోడల్స్ ఆధారంగా అభివృద్ధి చేసిన ఏఐ టీచర్ సేవలను వర్సిటీ వినియోగించుకోనుంది. కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఏఐ టీచర్ ద్వారా తాము విద్యార్ధి, టీచర్ నిష్పత్తిని 1:1 సాధించగలమని బావిస్తున్నామని కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ డేవిడ్ మలన్ పేర్కొన్నారు.
సెప్టెంబర్‌లో ఈ ప్రోగ్రాం ప్రారంభించేందుకు హార్వర్డ్ యూనివర్సిటీ సన్నాహాలు చేపట్టింది. ఏఐ చాట్‌బాట్ టీచర్‌తో ఆన్లైన్, ఆఫ్‌లైన్ విద్యార్ధులకు బోధనలో మేలు కలుగుతుందని అన్నారు. గత ఏడాది నవంబర్‌లో ఇంటరాక్టివ్ ఏఐ టూల్ చాట్‌జీపీటీని ఓపెన్ఏఐ లాంఛ్ చేసింది. చాట్‌జీపీటీకి టెక్ ప్రపంచంలో విశేష ఆదరణ లభిస్తున్న నేపధ్యంలో హార్వర్డ్ యూనివర్సిటీ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.