Amazon Prime Day sale | లేటెస్ట్ స్మార్ట్ఫోన్లపై హాట్ డీల్స్
Amazon Prime Day sale : ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ జులై 20న ప్రైమ్ డే సేల్ నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో షియామి, రియల్మీ స్మార్ట్ఫోన్లపై ఆకర్షణీయ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
Amazon Prime Day sale : ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ జులై 20న ప్రైమ్ డే సేల్ నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో షియామి, రియల్మీ స్మార్ట్ఫోన్లపై ఆకర్షణీయ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. జులై 20న ప్రారంభమయ్యే ప్రైమ్ డే సేల్ 21న ముగియనుంది. ఈ సేల్‌లో తమ ఫేవరెట్ గ్యాడ్జెట్స్‌ను తక్కువ ధరకు సొంతం చేసుకోవాలని కస్టమర్లు వేచిచూస్తున్నారు. సేల్‌లో షియోమి ఫోన్లు రూ. 7699 ప్రారంభ ధర నుంచి అదనపు ఆఫర్లతో లభిస్తున్నాయి.
రెడ్మి 12 5జీ స్పెషల్ కూపన్ ఆఫర్‌తో రూ. 11,499కే లభిస్తోంది. రెడ్మి 13 5జీ ఆఫర్లతో రూ. 12,999కే ప్రైమ్ డే సందర్భంగా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఇక షియోమి తన స్మార్ట్ఫోన్లపై రూ. 8000 వరకూ ఇన్స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్లను అందించడంతో పాటు 18 నెలల వరకూ నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్స్ అందుబాటులో ఉంచింది. మరోవైపు రియల్మీ ప్రైమ్ డేలో రూ. 7499 నుంచి తన స్మార్ట్ఫోన్లను ఆఫర్ చేస్తోంది.
రూ. 1000 వరకూ ఇన్స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్స్, రూ. 4000 వరకూ కూపన్ ఆఫర్స్‌ను అందుబాటులో ఉంచింది. న్యూ మిరకిల్ పర్పుల్ కలర్లో రియల్మీ జీటీ 6టీ 5జీని లాంఛ్ చేయడం ఈ సేల్ హైలైట్‌గా చెప్పుకోవచ్చు. లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌పై ఆకర్షణీయ ఆఫర్స్‌ను రియల్మీ అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇక రియల్మీ నార్జో 70xపై భారీ బ్యాంక్ ఆఫర్స్, కూపన్ డిస్కౌంట్స్ ఆఫర్లో ఉన్నాయి. రియల్మీ నార్జో 70 ప్రొ పలు డిస్కౌంట్ ఆపర్లతో రూ. 15,249కి సేల్‌లో లభిస్తోంది. ఇవే కాకుండా పలు స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్ తమ లేటెస్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లను సేల్ సందర్భంగా ఆఫర్ చేస్తున్నాయి.
Read More :
Dhammika Niroshana: శ్రీలంక అండర్-19 మాజీ కెప్టెన్ కాల్చివేత
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

