Dhammika Niroshana: శ్రీలంక అండర్-19 మాజీ కెప్టెన్ కాల్చివేత
Dhammika Niroshana: శ్రీలంక క్రికెటర్, అండర్-19 మాజీ కెప్టెన్ ధమ్మిక నిరోషానా .. హత్యకు గురయ్యాడు. మంగళవారం రాత్రి అతన్ని కాల్చి చంపారు. అంబలంగోడ నివాసం వద్ద అతన్ని గుర్తు తెలియని వ్యక్తులు షూట్ చేశారు.
కొలంబో: శ్రీలంక క్రికెటర్, అండర్-19 మాజీ కెప్టెన్ ధమ్మిక నిరోషానా(Dhammika Niroshana) .. హత్యకు గురయ్యాడు. మంగళవారం రాత్రి అతన్ని కాల్చి చంపారు. అంబలంగోడ నివాసం వద్ద అతన్ని గుర్తు తెలియని వ్యక్తులు షూట్ చేశారు. అక్కడే అతను స్కూల్ క్రికెట్ కెరీర్‌ను స్టార్ట్ చేశారు. అండర్ వరల్డ్ గ్యాంగ్ శత్రుత్వం వల్లే అతన్ని హత్య చేసి ఉంటారని శ్రీలంక పోలీసులు అనుమానిస్తున్నారు.
12 బోర్ ఫైర్ఆర్మ్తో నిందితుడు కాల్పులు జరిపాడు. ఈ విషయాన్ఇన పోలీసు ప్రతినిధి నిహాల్ తల్దువా తెలిపారు. అండర్19 మాజీ కెప్టెన్ నిరోషానా హత్యకు, మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ హెచ్ ప్రేమసిరి హత్యకు ఏదైనా లింకు ఉందా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు.
గల్లే డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ప్రేమసిరిని 2016, ఆగస్టు 12వ తేదీన హతమార్చారు. గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని షూట్ చేశారు. ప్రేమసిరి హత్యకు, అంతర్జాతీయ మ్యాచ్ ఫిక్సింగ్ రాకెట్‌తో లింకు ఉన్నట్లు అప్పట్లో అనుమానించారు.
శ్రీలంక అండర్-19 జట్టుకు 2000 సంవత్సరంలో నిరోషానా అరంగేట్రం చేశారు. అతను ఫాస్ట్ బౌలర్‌గా సేవలు అందించాడు. బ్యాటింగ్ కూడా చేసేవాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతని బౌలింగ్ యావరేజ్ 30 కన్నా తక్కువగా ఉంది. సీనియర్ జట్టులోకి అతను ప్రవేశించలేదు. కానీ స్టార్ ఆటగాళ్లు మాథ్యూస్, ఉపల్ తరంగ, మహరూఫ్ లాంటి వారితో ఆడారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

