ప్రపంచంలో ఆ 8 మంది దగ్గరే 75 లక్షల కోట్ల సంపద

న్యూయార్క్: ప్రపంచ కుబేరుల జాబితాలో తొలి 8 స్థానాల్లో ఉన్న వాళ్ల దగ్గరే లక్ష కోట్ల డాలర్ల (సుమారు రూ.75 లక్షల కోట్లు) సంపద పోగుపడినట్లు బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది. ఈ ఏడాది కుబేరుల సంపద భారీగా పెరగడంతో 10 వేల కోట్ల డాలర్ల (సుమారు రూ.7.5 లక్షల కోట్లు)కుపైగా సంపద కలిగిన వారి జాబితా 8కి పెరిగింది.
గత వారమే గూగుల్ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్లు కూడా ఈ లిస్ట్‌లో చేరారు. ఈ లిస్ట్‌లో ఉన్న 8 మంది కేవలం ఈ ఏడాదే 11 వేల కోట్ల డాలర్ల (సుమారు రూ.8.25 లక్షల కోట్లు) సంపదను అదనంగా పోగేసుకున్నట్లు బ్లూమ్‌బర్గ్ తెలిపింది.
1999లో తొలిసారి మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ సంపద 100 బిలియన్ డాలర్ల మార్క్‌ను అందుకుంది. ఆ తర్వాత 2017లో అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ కూడా ఈ మార్క్‌ను దాటాడు. గతేడాది టెస్లా చీఫ్ ఎలోన్ మస్క్, ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకెర్‌బర్గ్ కూడా ఈ లిస్ట్‌లో చేరారు.
100 బిలియన్ డాలర్ల సంపద కలిగిన వాళ్లలో ఎక్కువ మంది అమెరికాకు చెందిన టెక్ దిగ్గజాలే ఉన్నారు. వారెన్ బఫెట్, ఫ్రాన్స్‌కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్ట్, గూగుల్ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్ కూడా ఈ 100 బిలియన్ డాలర్ల సంపద జాబితాలో ఉన్నారు.

ఇవి కూడా చదవండి
IPL 2021: రాజస్థాన్ రాయల్స్ బౌలర్ వింత యాక్షన్ చూశారా.. వీడియో
‘స్పుత్నిక్ వి’కి డీసీజీఐ గ్రీన్‌సిగ్నల్
పది లక్షల టన్నుల న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వృథా నీళ్లు సముద్రంలోకి!
ప్రధాని మోదీకి సోనియా గాంధీ లేఖ
లంగా ఓణీలో మెరిసిపోతున్న శ్రీముఖి
ఉగాది స్పెషల్.. ఇంట్రెస్టింగ్ పోస్టర్స్ విడుదల
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

