రాంగ్ అకౌంట్‌కు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే ఎలా? ఆ డబ్బులు తిరిగి వస్తాయా? ప్రొసీజర్ ఏంటి?
రాంగ్ అకౌంట్‌కు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే ఎలా? | ఇది ఇంటర్నెట్ యుగం. ఎవరికైనా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలంటే క్షణాల్లో అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసే టెక్నాలజీ ప్రస్తుతం అందుబాటులో ఉంది
ఇది ఇంటర్నెట్ యుగం. ఎవరికైనా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలంటే క్షణాల్లో అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసే టెక్నాలజీ ప్రస్తుతం అందుబాటులో ఉంది. బ్యాంకులకు వెళ్లి లైన్లో నిలబడి.. ఫామ్ నింపి.. కౌంటర్ దగ్గరికి వెళ్లి డబ్బులను డిపాజిట్ చేసే రోజులు పోయాయి. ఇదంతా టెక్ యుగం.
టెక్నాలజీని బ్యాంకులు కూడా అందిపుచ్చుకున్నాయి. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తున్నాయి. ఆర్భీఐ కూడా డిజిటల్ లావాదేవీలకు సంబంధించి పటిష్ఠమైన భద్రతను అందిస్తోంది. స్మార్ట్ ఫోన్ ఉండి.. మొబైల్ డేటా ఉంటే చాలు.. అరచేతిలోనే ఎటువంటి లావాదేవీలనైనా చేసుకోవచ్చు.

ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, వాలెట్స్, యూపీఐ.. ఇలా పలు రకాల ఆప్షన్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా డబ్బులను ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అయితే.. ఒక్కోసారి పొరపాటుగా కొందరు రాంగ్ అకౌంట్‌కు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తుంటారు. అకౌంట్ నెంబర్ సరిగ్గా చూసుకోకుండా.. తప్పుడు అకౌంట్ ఇవ్వడం, ఐఎఫ్ఎస్సీ కోడ్ తప్పుగా ఉండటం.. ఇలా పలు కారణాల వల్ల ఒక్కోసారి రాంగ్ అకౌంట్‌కు డబ్బులు వెళ్తుంటాయి. అటువంటప్పుడు ఏం చేయాలి? ఆ డబ్బులు తిరిగి వస్తాయా? దాని కోసం ఏం చేయాలి? బ్యాంకుల దగ్గరికి వెళ్లాలా? లాంటి ఎన్నో ప్రశ్నలు చాలామంది కస్టమర్లను వేధిస్తుంటాయి. వాటికి సమాధానమే ఈ కథనం.
వెంటనే సంబంధిత బ్యాంకుకు సమాచారమివ్వండి
రాంగ్ అకౌంట్‌కు పొరపాటున డబ్బులు పంపిస్తే.. ముందు చేయాల్సిన పని.. సంబంధిత బ్యాంకుకు సమాచారం ఇవ్వడం. అవును.. వెంటనే.. రాంగ్ అకౌంట్‌కు డబ్బులు వెళ్లాయని తెలుసుకోగానే ఆ బ్యాంకుకు సమాచారం అందించాలి. వెంటనే కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి.. ట్రాన్సాక్షన్ చేసిన తేదీ, టైమ్.. అన్ని వివరాలకు చెప్పాలి. ఒకవేళ.. మెయిల్ చేయాలని చెబితే.. మెయిల్లో కూడా లావాదేవీకి సంబంధించిన అన్ని వివరాలను పొందుపరచాలి. డబ్బులు ట్రాన్స్ఫర్ అయిన అకౌంట్ నెంబర్‌తో సహా.. అన్ని వివరాలతో మెయిల్ చేయాల్సి ఉంటుంది.
ఒకవేళ ఇన్వాలిడ్ అకౌంట్‌కు డబ్బులు పంపిస్తే
కొందరు తెలియకుండా.. అకౌంట్ నెంబర్ తప్పుగా టైప్ చేస్తారు. దాని వల్ల.. డబ్బులు ఇన్వాలిడ్ అకౌంట్‌కు వెళ్తుంటాయి. దాని వల్ల.. డబ్బులు ఏ అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ కావు. వెంటనే తిరిగి ఆ డబ్బులు సొంత అకౌంట్లోకి రిఫండ్ అవుతాయి. ఒకవేళ డబ్బులు తిరిగి ట్రాన్స్ఫర్ కాకపోతే.. వెంటనే హోమ్ బ్రాంచ్‌ను సంప్రదించి.. మేనేజర్‌కు అన్ని వివరాలు చెబితే.. మేనేజర్ వెంటనే ఫండ్స్‌ను ఇనిషియేట్ చేస్తారు.

ఒకవేళ వాలిడ్ అకౌంట్‌కు డబ్బులు పంపిస్తే
ఒకవేళ.. రాంగ్ అకౌంట్ నెంబర్ టైప్ చేసినా కూడా.. అది వేరే వాళ్ల అకౌంట్ నెంబర్ అయి ఉండొచ్చు. అలాంటి సమయాల్లో డబ్బులు తిరిగి రావడానికి కాస్త సమయం పడుతుంది. ఒక్కోసారి నెలలు కూడా పట్టే అవకాశం ఉంటుంది. ఏ అకౌంట్‌కు, బ్యాంక్ బ్రాంచ్‌కు డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయో.. మీ బ్యాంకులో తెలుసుకోవచ్చు. ఫిర్యాదు ఇచ్చాక.. బ్యాంకు.. డబ్బులు ట్రాన్స్ఫర్ అయిన అకౌంట్ ఓనర్‌ను పర్మిషన్ అడుగుతుంది. ఆ తర్వాత డబ్బులను అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేస్తుంది.
ఒకవేళ ఆ అకౌంట్ ఓనర్ పర్మిషన్ ఇవ్వకపోతే
కొందరు అకౌంట్ హోల్డర్లు.. డబ్బులు తిరిగి పంపించడానికి ఒప్పుకోరు. అటువంటి సమయాల్లో వాళ్ల మీద కేసు ఫైల్ చేయొచ్చు. కానీ.. ఇక్కడ ఆర్బీఐ గైడ్‌లైన్స్‌ను ఫాలో కావాల్సి ఉంటుంది. బెనిఫిషియరీ అకౌంట్ గురించి సరైన వివరాలు ఇవ్వడం అనేది డబ్బులు పంపించే వ్యక్తి బాధ్యత. డబ్బులు పంపించే కస్టమర్.. రాంగ్ అకౌంట్‌కు డబ్బులు పంపిస్తే.. బ్యాంకు దానికి బాధ్యత వహించదు. కానీ.. బాధితుడి తరుపున.. ట్రాన్స్ఫర్ అయిన వ్యక్తికి రిక్వెస్ట్ మాత్రం పంపిస్తుంది. ఒకవేళ ఆ వ్యక్తి.. డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకోకపోతే.. అప్పుడు లీగల్‌గా వెళ్లాల్సి ఉంటుంది.
ఆర్బీఐ రూల్స్ ఏమంటున్నాయి?
అయితే.. రాంగ్ అకౌంట్‌కు డబ్బులు పంపించే కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఆర్బీఐ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎవరికైనా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయగానే.. ఆర్బీఐ ఒక మెసేజ్ పంపిస్తుంది. ఒకవేళ.. ట్రాన్సాక్షన్లో ఏవైనా సమస్యలు ఎదురైతే.. తప్పుడు అకౌంట్లో డబ్బులు జమ అయితే.. ఈ నెంబర్‌కు మెసేజ్ పంపించాలంటూ ఒక మెసేజ్‌ను పంపిస్తోంది. అలాగే.. బ్యాంకులు కూడా ఇలాంటి ట్రాన్సాక్షన్‌కు సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆర్బీఐ రూల్స్ పాస్ చేసింది. వెంటనే అటువంటి రాంగ్ లావాదేవీలపై వెంటనే యాక్షన్ తీసుకొని.. సరైన అకౌంట్‌కు డబ్బులు పంపించేలా బాధ్యత తీసుకోవాలని ఆర్బీఐ సూచించింది. కాబట్టి.. ఒకవేళ పొరపాటున రాంగ్ అకౌంట్‌కు డబ్బులు పంపిస్తే.. టెన్షన్ పడకండి.. వెంటనే సంబంధిత బ్యాంకులో సంప్రదిస్తే.. వెంటనే దానికి సంబంధించిన చర్యలను వాళ్లు తీసుకుంటారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Term Insurance : టర్మ్ ఇన్సురెన్స్ ప్రీమియం రేట్లను తగ్గించిన ఆదిత్య బిర్లా సన్‌లైఫ్
Loans For Used Cars | సెకండ్ హ్యాండ్ కార్లకూ బ్యాంకు రుణాలు.. డిటైల్స్ ఇవే
ఆధార్-ఈపీఎఫ్ ఖాతా లింక్ గడువు డిసెంబర్‌కు పొడిగింపు
Wipro : విప్రోలో ముగిసిన వర్క్ ఫ్రం హోం
హైదరాబాద్-లండన్ డైరెక్ట్ ఫ్లైట్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

