Wealth | జెఫ్ బెజోస్ సహా 18 మంది సంపద ఆవిరి.. కానీ అదానీ-అంబానీ డిఫరెంట్..!
Wealth | ప్రపంచవ్యాప్తంగా టాప్-20 కుబేరుల్లో 18 మంది సంపద ఆవిరి కాగా, భారత్ బిలియనీర్లు ముకేశ్ అంబానీ, గౌతం అదానీ వ్యక్తిగత సంపద పెరిగింది.
Wealth | ప్రపంచవ్యాప్తంగా అపర కుబేరుల సంపద ఒక్కరోజులో భారీగా కరిగిపోయింది. దానికి భిన్నంగా భారత్ బిలియనీర్ల సంపద పెరగడం ఆసక్తి కర పరిణామం.
బెర్నార్డ్ అర్నాల్ట్, జెఫ్ బెజోస్, బిల్ గేట్స్ నుంచి వారెన్ బఫెట్ తదితర ప్రపంచ అపర కుబేరుల సంపద గత 24 గంటల్లో భారీగా పడిపోయింది. అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ వ్యక్తిగత సంపద భారీగా నష్టపోయారు.
బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం బెర్నార్డ్ అర్నాల్ట్ సంపద కరిగిపోవడంతో.. ప్రపంచ కుబేరుల్లో ఆయన స్థానం రెండో ర్యాంకుకు పడిపోయింది. భారత కార్పొరేట్ అధినేతలు గౌతం అదానీ, ముకేశ్ అంబానీ వ్యక్తిగత సంపద శరవేగంగా పెరిగింది. ఈ ఇండెక్స్ ప్రకారం గత 24 గంటల్లో టాప్-20 కుబేరుల్లో 18 మంది వ్యక్తిగత సంపద హరించుకపోయింది.
ఇలా ఆవిరైన కుబేరుల సంపద
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ వ్యక్తిగత సంపద రూ.1,63,909 కోట్లు కోల్పోయారు. ఆయన నికర సంపద 139 బిలియన్ డాలర్లు.
ఎల్వీఎంహెచ్ ఫౌండర్ బెర్నార్డ్ అర్నాల్ట్ వ్యక్తిగత సంపద రూ.92 వేల కోట్లు కరిగిపోయి 192 బిలియన్ డాలర్ల వద్ద నిలిచింది.
టెస్లా కో-ఫౌండర్, స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ వ్యక్తిగత సంపద రూ.18,350 కోట్లు కోల్పోయారు. ఆయన వ్యక్తిగత సంపద 180 బిలియన్ డాలర్లు.
ప్రపంచ ప్రఖ్యాత వ్యాపారవేత్త వారెన్ బఫెట్ వ్యక్తిగత సంపద రూ.18,102 కోట్లు కోల్పోయారు. ఇప్పుడు ఆయన వ్యక్తిగత సంపద 113 బిలియన్ డాలర్లు.
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వ్యక్తిగత సంపద రూ.8,266 కోట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఆయన వ్యక్తిగత నికర సంపద 125 బిలియన్ డాలర్లు.

Adaniambani
ఇదిలా ఉంటే.. ప్రపంచ అపర కుబేరుల్లో భారతీయ బిలియనీర్ గౌతం అదానీ తిరిగి టాప్-20 కుబేరుల జాబితాలోకి ఎంటరయ్యారు. ఒక్కరోజులో ఆయన వ్యక్తిగత సంపద 4.38 బిలియన్ డాలర్లుపెరిగి 64.2 బిలియన్ డాలర్లకు దూసుకెళ్లింది. గత జనవరి నెలాఖరులో యూఎస్ షార్ట్ షెల్లర్ ‘హిండెన్ బర్గ్ రీసెర్చ్’ నివేదికతో గౌతం అదానీ వ్యక్తిగత సంపద హరించుకు పోయిన సంగతి తెలిసిందే. ఫలితంగా ఫిబ్రవరిలో అదానీ.. టాప్-20 కుబేరుల జాబితా నుంచి వెళ్లిపోయారు.
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ వ్యక్తిగత సంపద రూ.45,380 కోట్లు పెరిగి 84.1 బిలియన్ డాలర్ల వద్ద నిలిచింది. ప్రస్తుతం టాప్-20 కుబేరుల్లో ముకేశ్ అంబానీ 13వ ర్యాంకులో నిలిచారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

