ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ వివిధ రంగాల్లో తెలంగాణ సర్కార్‌తో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చింది. వ్యవసాయం, వాతావరణ మార్పు, పట్టణ కాలుష్య సమస్యల పరిషారంలో రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం అవుతామని తెలిపింది. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం గూగుల్ ఆసియా పసిఫిక్ ఏరియా ప్రెసిడెంట్ సంజయ్ గుప్తాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రాంతీయ ఆర్థిక వృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న క్యూర్, ప్యూర్, రేర్ తదితర అభివృద్ధి నమూనాలను ముఖ్యమంత్రి వివరించారు.