మాకేమీ తెల్వదు: సెబీ
‘గౌతమ్ అదానీ ఎఫ్‌పీవోలో పాల్గొన్నదెవరో మాకు తెలియదు. ఆ పబ్లిక్ ఇష్యూ సబ్స్కైబర్ల సమాచారం మా వద్ద లేదు’ ఇది.. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద దాఖలైన ఓ ప్రశ్నకు భారత క్యాపిటల్ మార్కెట్ నియంత్రిత సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) చెప్పిన సమాధానం.
- అదానీ ఎఫ్‌పీవో సబ్‌స్క్రిప్షన్‌పై ఆర్టీఐ ప్రశ్నకు సమాధానం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: ‘గౌతమ్ అదానీ ఎఫ్‌పీవోలో పాల్గొన్నదెవరో మాకు తెలియదు. ఆ పబ్లిక్ ఇష్యూ సబ్స్కైబర్ల సమాచారం మా వద్ద లేదు’ ఇది.. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద దాఖలైన ఓ ప్రశ్నకు భారత క్యాపిటల్ మార్కెట్ నియంత్రిత సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) చెప్పిన సమాధానం. అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఈ ఏడాది జనవరి ఆఖర్లో రూ.20,000 కోట్ల ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీవో)ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే హిండెన్‌బర్గ్ నివేదిక, తదనంతర పరిణామాల మధ్య ఫిబ్రవరి 1న అనూహ్యంగా రద్దు చేసిన సంగతీ విదితమే. ఈ నేపథ్యంలో జనవరి 31న, ఫిబ్రవరి 8న ప్రసెన్జిత్ బోస్ అనే వ్యక్తి ఆర్టీఐ ద్వారా రెండు వేర్వేరు దరఖాస్తులను సెబీకి పెట్టుకున్నారు.
మొదటి అప్లికేషన్ ప్రశ్న ఇది..
ఎఫ్‌పీవోలో పాల్గొన్న సబ్స్కైబర్ల వివరాలు తెలపండి. షేర్లను ఎంతకు సబ్‌స్ర్కైబ్ చేశారన్న సమాచారం ఇవ్వండి. అసలు ఎఫ్‌పీవో రద్దుకు కారణం ఏమిటన్నది తెలియజేయండి.
రెండో అప్లికేషన్ ప్రశ్న ఇది..
హిండెన్‌బర్గ్ రిపోర్టుపై దర్యాప్తు జరుగుతున్నదా?, స్టాక్స్ ధరల్లో అదానీ గ్రూప్ సంస్థల అక్రమాలపై, రౌండ్ ట్రిప్పింగ్, ఖాతాల్లో మోసం, మనీ లాండరింగ్‌పై ఎవరైనా ఫిర్యాదు చేశారా? చెప్పండి.
పై రెండింటికీ చీఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (సీపీఐవో) నుంచి ‘సెబీ దగ్గర మీరు అడిగిన ప్రశ్నలకు సమాచారం లేదు’ అంటూ బోస్‌కు సమాధానం వచ్చింది. ఇంకా సెబీ మాటల్లోనే చెప్పాలంటే..
మొదటి అప్లికేషన్‌కు సమాధానం
మీరు కోరిన సమాచారం ఓ పబ్లిక్ అథారిటీ రికార్డులో భాగం కాదు. ఏ చట్టం కిందనైనాసరే సదరు సమాచారాన్ని ఉంచుకోవాల్సిన అవసరం లేదు. మా నియమ నిబంధనలూ అలా లేవు. అందుబాటులో లేని సమాచారాన్ని అన్వేషించి, సేకరించి దరఖాస్తుదారునికి అందించాలని ఈ చట్టం (ఆర్టీఐ) చెప్పట్లేదు.
రెండో అప్లికేషన్‌కు సమాధానం
ఈ దరఖాస్తులో మీరు కోరినది ‘సమాచారం’గా పరిగణించడం లేదు. అదానీ గ్రూప్ సంస్థలకు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇచ్చిన రుణాలకు సంబంధించిన సమాచారం సెబీ వద్ద ఉండదు. ఆ సమాచారాన్ని ఉంచుకోవాలని మా నిబంధనావళి కూడా చెప్పడం లేదు.
హిండెన్‌బర్గ్ ఆరోపణల నేపథ్యంలో ఎఫ్‌పీవో పూర్తిగా సబ్‌స్కైబ్ అయినప్పటికీ అదానీ ఎంటర్ప్రైజెస్ దాన్ని రద్దు చేసినది తెలిసిందే. అయితే పలువురు కార్పొరేట్ దిగ్గజాల అండతోనే ఈ ఎఫ్‌పీవో పూర్తిస్థాయిలో సబ్‌స్కైబ్ అయ్యిందని, దీని వెనుక మోదీ సర్కారు ఒత్తిడి కూడా ఉందన్న వార్తలు వినిపించినది విదితమే. మొత్తానికి ఆర్టీఐ దరఖాస్తులకు సెబీ చెప్పిన సమాధానాలు హాట్ టాపిక్‌గా మారాయిప్పుడు. ఓ రెగ్యులేటర్‌కు ఇంతటి బాధ్యతారాహిత్యమా? అన్న విమర్శలూ వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- FPO
- gautam adani
- RTI
- sebi
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

