హైదరాబాద్, సెప్టెంబర్ 17: ప్రాంతీయ వార్తలు అందించే వే2న్యూస్ మరోసారి భారీ స్థాయిలో నిధులను సమీకరించింది. వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్ నుంచి 14 మిలియన్ డాలర్లు(రూ.117 కోట్లు) సేకరించినట్లు కంపెనీ ఫౌండర్, సీఈవో రాజు వనపాల తెలిపారు.
వ్యాపారాన్ని విస్తరించడానికి, బ్రాండ్‌ను మరింత బలోపేతం చేసే ఉద్దేశంలో భాగంగా ఈ నిధులను సేకరించినట్లు చెప్పారు. అలాగే వెంచర్ క్యాపిటలిస్ట్ శశి రెడ్డి కూడా పెట్టుబడులు పెట్టారు కూడా. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ర్టాల్లో సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే.