హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 13 (నమస్తే తెలంగాణ): ఆర్థికాభివృద్ధికి సంకేతమైన వేర్‌హౌజింగ్ లీజింగ్ కార్యకలాపాలు హైదరాబాద్‌లో జోరుగా సాగుతున్నాయి. నైట్ఫ్రాంక్విడుదల చేసిన ఇండియా వేర్ హౌజింగ్ మార్కెట్ రిపోర్ట్-2023 ప్రకారం గత ఆర్థిక సంవత్సరం హైదరాబాద్‌లో 5.1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో కూడిన వేర్‌హౌజింగ్‌ను లీజుకు తీసుకున్నారు. ఈ విభాగంలో నగరంలో 2017-2023 వరకు గత 5 ఏళ్లలో 27 శాతం పెరుగుదల నమోదైందని నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజాల్ తెలిపారు.
గ్రేటర్ పరిధిలో 3 చోట్ల గిడ్డంగులు
గ్రేటర్ హైదరాబాద్‌లో వేర్‌హౌజింగ్ కార్యకలాపాల్లో 61 శాతం వాటాతో మేడ్చల్ క్లస్టర్ మొదటి స్థానంలో ఉండగా, తర్వాతి స్థానాల్లో శంషాబాద్ (27 శాతం) పటాన్చెరువు (11 శాతం) నిలిచినట్టు నివేదికలో పేర్కొన్నారు.