Vodafone Idea | ప్రముఖ టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా (Vodafone Idea) తన కస్టమర్లు తనకు నచ్చిన ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఎంచుకునే వెసులుబాటు కల్పిస్తున్నది. రీచార్జీ ప్లాన్‌కు అనుగుణంగా వొడాఫోన్ ఐడియా అందించే ఓటీటీ ప్లాట్పామ్స్ ఎంచుకునే చాన్స్ కల్పిస్తున్నది. ఈ ప్రయోజనం కేవలం పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు మాత్రమే లభిస్తుంది.
వొడాఫోన్ ఐడియా పోస్ట్ పెయిడ్ ప్లాన్లు రూ.401 నుంచి మొదలవుతాయి. 50 జీబీ డేటా అపరిమిత వాయిస్ కాల్స్, నెలకు 300 ఎస్ఎంఎస్లు అందిస్తుంది. దీంతోపాటు హంగామా మ్యూజిక్, వొడాఫోన్ మూవీస్, వొడాఫోన్ టీవీ, వొడాఫోన్ గేమ్స్ పొందొచ్చు. వీటితోపాటు డిస్నీ + హాట్ స్టార్, సోనీ లివ్ మొబైల్, సన్ నెక్ట్స్ ప్రీమియం, ఈజీ మై ట్రిప్ ద్వారా రిటర్న్ విమానాల బుకింగ్ మీద నెలకు రూ.750 తగ్గింపు.. తదితర ఆప్షన్లలో సబ్స్క్రైబర్లు తమకు నచ్చిన ఆప్షన్ ఎంచుకోవచ్చు. వొడాఫోన్ ఐడియా మ్యాక్స్ ప్రీ పెయిడ్ ప్లాన్ కింద రూ.501 రీచార్జీతో రెండు ఓటీటీ ప్లాట్ ఫామ్స్, రూ.701 రీచార్జీతో మూడు ఓటీటీ సబ్ స్క్రిప్షన్లు పొందొచ్చు.