Vivo-India | కష్టాల్లో వివో ఇండియా.. మరో ముగ్గురు ఎగ్జిక్యూటివ్ ల అరెస్ట్..?!
Vivo-India | మనీ లాండరింగ్ కేసులో చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో అనుబంధ వివో ఇండియాకు చెందిన ముగ్గురు ఎగ్జిక్యూటివ్ లను అరెస్ట్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వర్గాలు తెలిపాయి.
Vivo-India | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో అనుబంధ వివో ఇండియా కష్టాల్లో చిక్కుకున్నట్లు కనిపిస్తున్నది. మనీ లాండరింగ్ కేసులో వివో ఇండియాకు చెందిన మరో ముగ్గురు అధికారులను అరెస్ట్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. హవాలా లావాదేవీల నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) చట్టంలోని వివిధ సెక్షన్ల కింద వీరిని ఈడీ అధికారులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తున్నది. ఎవరెవరిని అరెస్ట్ చేశారన్నది సంగతి వెల్లడించలేదు.
ఇంతకుముందు హవాలా లావాదేవీల నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద లావా ఇంటర్నేషనల్ ఎండీ హరి హోం రాయ్, చైనీయుడు గౌంగ్వెన్ అలియాస్ ఆండ్రూ కువాంగ్, చార్టర్డ్ అకౌంటెంట్లు నితిన్ గార్గ్, రాజన్ మాలిక్ అరెస్టయిన సంగతి తెలిసిందే. వీరు నలుగురు ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు.
గతేడాది జూలైలో వివో ఇండియా కార్యాలయాలు, సంబంధిత ఎగ్జిక్యూటివ్‌ల నివాసాల్లో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దేశంలో స్మార్ట్ ఫోన్ల విక్రయాల ద్వారా రూ.62,476 కోట్ల మేరకు చైనాకు వివో ఇండియా అక్రమంగా తరలించిందని ఈడీ అభియోగం. వివో ఇండియాతోపాటు మరికొన్ని స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థలపై మనీ లాండరింగ్ కేసులు దర్యాప్తు చేసిన ఈడీ.. ఇటీవలే పీఎంఎల్ఏ ప్రత్యేక న్యాయస్థానంలో తొలి చార్జిషీట్ దాఖలు చేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

