Vehicle sales | కార్లలో మారుతి.. బైక్స్‌లో హీరో మోటో కార్ప్ దూకుడు.. భారీగా పెరిగిన త్రీ వీలర్స్ సేల్స్..!
Vehicle Sales | 2022తో పోలిస్తే సెప్టెంబర్ లో వాహనాల విక్రయాలు 20.36 శాతం పెరిగాయి. అనూహ్యంగా త్రీ వీలర్స్ సేల్స్ 48.58 శాతం పుంజుకోవడం గమనార్హం.
Vehicle sales | గతేడాదితో పోలిస్తే సెప్టెంబర్ నెలలో వాహనాల విక్రయాల్లో 20.36 శాతం గ్రోత్ రికార్డైంది. 2022 సెప్టెంబర్ నెలలో 17,70,181 వాహనాలు అమ్ముడైతే.. గత నెలలో 18,82,071 వెహికిల్స్ సేల్ అయ్యాయని ఆటోమొబైల్ డీలర్ సంఘాల సమాఖ్య (ఫాడా) సోమవారం నివేదిక వెల్లడించింది.
త్రీ వీలర్స్ సేల్స్‌లో అత్యధికంగా 48.58 శాతం గ్రోత్ నమోదైంది. 2022 సెప్టెంబర్‌లో కేవలం 68,937 త్రీ వీలర్స్ అమ్ముడైతే, గత నెలలో 1,02,426 వాహనాలు అమ్ముడయ్యాయి. వాణిజ్య వాహనాల విక్రయాల్లోనూ 4.87 శాతం పురోగతి నమోదైంది. 2022 సెప్టెంబర్ లో 77,054 కమర్షియల్ వెహికల్స్ అమ్ముడైతే, గత నెలలో 80,804 వాహనాలు సేల్ అయ్యాయి.
కార్ల విభాగంలో మారుతి సుజుకి సేల్స్ 42.03 శాతం పెరిగాయి. 2022 సెప్టెంబర్ లో 1,11,159 కార్లు అమ్ముడైతే, గత నెలలో 1,39,640 యూనిట్లు విక్రయించింది మారుతి. తర్వాతీ స్థానంలో ఉన్న హ్యుండాయ్ 41,805 నుంచి 49,625 యూనిట్లకు, టాటా మోటార్స్ 38,244 యూనిట్ల నుంచి 38,984 యూనిట్లకు, మహీంద్రా అండ్ మహీంద్రా 24,471 నుంచి 32,989 యూనిట్లకు, కియా మోటార్స్ 19,109 నుంచి 21,030 యూనిట్ల కార్లు విక్రయించాయి.
ఇక టూ వీలర్స్ సేల్స్‌లో హీరో మోటో కార్ప్ ముందు వరుసలో నిలిచింది. 2022 సెప్టెంబర్‌లో 2,69,498 బైక్ లు, స్కూటర్లు విక్రయిస్తే, గత నెలలో 3,51,781 యూనిట్లు విక్రయించింది. హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా 2,98,389 నుంచి 3,48,899 యూనిట్లు, టీవీఎస్ 1,78,589 నుంచి 2,28,852 యూనిట్లు, బజాజ్ ఆటో సేల్స్ 1,16,034 నుంచి 1,49,314 మోటారు సైకిళ్లు, స్కూటర్లకు పెరిగాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

