హైదరాబాద్, జూన్ 27: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు అందిస్తున్న గ్లాండ్ ఫార్మాకు అమెరికా గట్టి షాకిచ్చింది. హైదరాబాద్‌లో ఉన్న ఫార్మా యూనిట్‌పై అమెరికా హెల్త్ రెగ్యులేటరీ ఇటీవల తనిఖీ చేసి ఫామ్ 483 జారీ చేసింది.
ఈ నెల 15 నుంచి 27వరకు నగరానికి సమీపంలోని పాశమైలారం వద్ద ఉన్న ప్లాంట్‌లో తయారవుతున్న ఏడు ఔషధాలను క్షుణ్ణంగా తనిఖీ చేసినట్టు కంపెనీ బీఎస్ఈకి సమాచారం అందించింది.