యూస్డ్ వెహికల్స్ స్టార్టప్ కార్స్24లో సాఫ్ట్ బ్యాంక్ పెట్టుబడులు?!
కార్స్24లో సాఫ్ట్ బ్యాంక్ పెట్టుబడులు?! | న్యూఢిల్లీ: యూస్డ్ కార్ల స్టార్టప్ కార్స్24లో జపాన్ ఫైనాన్సియల్ సర్వీసెస్ సంస్థ సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్......

న్యూఢిల్లీ: యూస్డ్ కార్ల స్టార్టప్ కార్స్24లో జపాన్ ఫైనాన్సియల్ సర్వీసెస్ సంస్థ సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్, డీఎస్టీ గ్లోబల్ 350 మిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నాయని సమాచారం. ఫాల్కన్ ఎడ్జ్ క్యాపిటల్ సైతం కార్స్ 24లో పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిసింది.
దీంతో కార్స్ 24 మార్కెట్ క్యాపిటలైజేషన్ 200 కోట్ల డాలర్లకు చేరువలో ఉన్నట్లు వినికిడి. అయితే, ఈ విషయమై స్పందించడానికి కార్స్ 24, సాఫ్ట్ బ్యాంక్ స్పందించడానికి నిరాకరించాయి.

కార్స్ 24లో సాఫ్ట్ బ్యాంక్, జీఎస్టీ గ్లోబల్ తదితర సంస్థల పెట్టుబడులపై తదుపరి చర్చలు త్వరలో ముగుస్తాయని తెలుస్తున్నది. వచ్చే 18-24 నెలల్లో ఐపీవోకు వెళ్లడానికి కార్స్ 24 ప్రయత్నిస్తున్నది.
కరోనా నేపథ్యంలో ప్రజా రవాణాకు దూరంగా ఉండేందుకు ప్రజానీకం యూస్డ్ కార్ల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. కొత్త కారు కొనడానికి బదులు యూస్డ్ కార్లు కొనుగోలు చేయడం వల్ల ఖర్చు తగ్గుతుందని భావిస్తున్నారు. దీంతో పెట్టుబడులు సమీకరించడానికి కార్స్ 24 స్టార్టప్ చేస్తున్న ప్రయత్నాలకు ప్రాధాన్యం ఏర్పడింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

