న్యూయార్క్, ఆగస్టు 23: వచ్చే నెల సమీక్షలో వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలున్నాయని అమెరికా ఫెడరల్ రిజర్వు చైర్మన్ జెరోమ్ పోవెల్ సంకేతాలిచ్చారు. సెప్టెంబర్ 16 నుంచి 17 వరకు రెండు రోజుల పాటు ఫెడ్ రిజర్వు సమావేశంకాబోతున్నది.
ఈ సమావేశంలోనే వడ్డీరేట్ల తగ్గింపు నిర్ణయం తీసుకోనున్నది. ఉద్యోగ కల్పన ఊపందుకున్నప్పటికీ, ద్రవ్యోల్బణ గణాంకాలు ఒత్తిడికి గురి చేస్తున్నాయని, ఈ నేపథ్యంలో వడ్డీరేట్లను తగ్గించాల్సిన అవసరం ఉన్నదని ఆయన పేర్కొన్నారు.