న్యూఢిల్లీ, జూన్ 2: యూపీఐ లావాదేవీలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మే నెలలో రూ.25.14 లక్షల కోట్ల లావాదేవీలు జరిగినట్లు ఎన్పీసీఐ వెల్లడించింది. అంతక్రితం నెలలో జరిగిన రూ.23.94 లక్షల కోట్ల లావాదేవీలతో పోలిస్తే ఐదు శాతం అధికమయ్యాయని తెలిపింది. సంఖ్యపరంగా చూస్తే 1,867.7 కోట్ల లావాదేవీలు జరిపారు. అలాగే ఏప్రిల్ నెలలో ఇది 1,789.3 కోట్ల లావాదేవీలు జరిగాయి. క్రితం ఏడాది ఇదే నెలలో జరిగిన రూ.20.44 లక్షల కోట్ల యూపీఐ లావాదేవీలతో పోలిస్తే మాత్రం 23 శాతం వార్షిక వృద్ధి నమోదైందని పేర్కొంది.