Ducati Streetfighter V4 | లగ్జరీ మోటారు సైకిల్ బ్రాండ్ డుకాటీ ఇండియా.. దేశీయ మార్కెట్లో తన స్ట్రీట్ ఫైటర్ వీ4 హైపర్ నాక్డ్ బైక్ అప్డేటెడ్ వర్షన్ రిలీజ్ చేసింది. ఈ మోటారు సైకిల్ 1103 సీసీ ఇంజిన్తో నడుస్తుంది. మారుతి స్విఫ్ట్, మారుతి డిజైర్ కార్లలో వాడిన ఇంజిన్తో ఈ ఇంజిన్ సమానం. డుకాటీ స్ట్రీట్ ఫైటర్ వీ4 మోటారు సైకిల్ ధర రూ.24.62 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది.
2024 స్ట్రీట్ ఫైటర్ వీ4 మోటారు సైకిల్ రెండు వేరియంట్లు – వీ4, వీ4ఎస్ వేరియంట్లలో లభిస్తుంది. రెండు వేరియంట్ మోటారు సైకిళ్లు షైనీ డుకాటీ రెడ్ పెయింట్ కలర్ ఆప్షన్ లో లభిస్తాయి. డుకాటీ వీ4 ఎస్ ఎడిషన్ గ్రే నీరో కలర్ లో లభిస్తుంది.
కేటీఎం 1290 సూపర్ డ్యూక్ ఆర్, కవాసాకీ జడ్ హెచ్2, అర్పిల్లా టౌంటో వీ4, బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్ మోటారు సైకిళ్లతో డుకాటీ స్ట్రీట్ ఫైటర్ వీ4 బైక్ పోటీ పడుతుంది. డుకాటీ స్ట్రీట్ ఫైటర్ వీ4 మోటారు సైకిల్ రూ.24.62 లక్షలు, డుకాటీ వీ4 ఎస్ మోటారు సైకిల్ రూ.28 లక్షలు పలుకుతుంది. రెండు డుకాటీ స్ట్రీట్ ఫైటర్ వీ4 మోటారు సైకిళ్లలోనూ డెస్మోసెడికి వీ4 ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ 13000 ఆర్పీఎం వద్ద గరిష్టంగా 205 హెచ్పీ విద్యుత్, 9500 ఆర్పీఎం వద్ద 123 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ తో పని చేస్తుంది.