Panama paper leaks | పనామా, ప్యారడైజ్, పండోరా పేపర్స్‌లో 930 భారత సంస్థలకు చెందిన రూ.20,353 కోట్ల విలువైన లెక్కలు చూపని ఆస్తులు బయటపడ్డాయని కేంద్రం తెలిపింది. పనామా అండ్ ప్యారడైజ్ పేపర్స్ లీక్స్‌లో బయటపడ్డ ఆస్తులపై రూ.153.88 కోట్ల పన్ను వసూలు చేసినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మంగళవారం తెలిపారు. రాజ్యసభలో బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ సంగతి చెప్పారు.
ఆదాయం పన్ను చట్టం-1961, బ్లాక్ మనీ (అన్ డిస్క్లోజ్ ఫారిన్ ఇన్‌కం అండ్ అసెట్స్) అండ్ ఇంపొజిషన్ ఆఫ్ టాక్స్ యాక్ట్-2015 నిబంధనలను ఉల్లంఘించిన వ్యక్తులను ఆదాయం పన్ను విభాగం తగు చర్యలు తీసుకున్నట్లు పంకజ్ చౌదరి స్టేట్మెంట్ సమర్పించారు. బ్లాక్ మనీ (అన్ డిస్‌క్లోజ్డ్ ఫారిన్ ఇన్‌కం అండ్ అసెట్స్) అండ్ ఇంపొజిషన్ ఆఫ్ టాక్స్ యాక్ట్-2015 ప్రకారం పనామా, ప్యారడైజ్ లీక్స్‌కు సంబంధించి 52 కేసులు నమోదు చేశామని తెలిపారు.