బెంగళూరు, నవంబర్ 8: ఎడ్యుటెక్ సేవల సంస్థ అనకాడమి మరోమారు భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమైంది. ఇప్పటికే 600 మంది సిబ్బందిని తొలగించిన సంస్థ..తాజాగా మరో 350 మందికి ఉద్వాసన పలకబోతున్నది. ఈ రోజుల్లో అందరూ చూస్తున్న కఠినమైన ఆర్థిక పరిస్థితులు మనకు కొత్తేమికాదు..సాంకేతిక రంగాలకు ఇది క్లిష్టసమయం..రోజులు గడుస్తున్నకొద్ది ఈ పరిస్థితులు మరింత పెరుగుతున్నాయని ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్లో కంపెనీ సీఈవో గౌరవ్ ముంజల్ తెలిపారు. ఈ క్లిష్టసమయంలో ఎదురైన పరిస్థితులను తట్టుకోవాలనే ఉద్దేశంతో నెలవారి ఖర్చులను తగ్గించుకోవడానికి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు, దీంట్లో భాగంగానే ఉద్యోగులను తొలగించినట్లు చెప్పారు.