హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న దేశీయ మార్కెట్‌తో సంబంధాలను కొనసాగించడానికి యూకే ఇండియా.. టీ హబ్‌తో జట్టుకట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఎమర్జింగ్ టెక్నాలజీకి పెరుగుతున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని టీ హబ్‌లో యాక్సిలరేటర్ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు టీ హబ్ ప్రతినిధి ఈ సందర్భంగా తెలిపారు. ఈ కేంద్రంతో ఇక్కడి స్టార్టప్‌లను మరింత ప్రోత్సహించడానికి వీలు పడనున్నదన్నారు. ఇందులో ప్రధానంగా కృత్రిమ మేధస్సు, సెమికండక్టర్ పురోగతిపై పనిచేస్తున్న స్టార్టప్‌లకు పూర్తి స్థాయిలో సహకారం అందించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు చెప్పారు. ఔత్సాహిక స్టార్టప్‌ల నిర్వాహకులు ఈ లింకు (https:// bit.ly/ 3uGspmO) ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు టీ హబ్ 4వ విడత రూబ్రిక్స్ కోహర్ట్ కార్యక్రమానికి శ్రీకారంచుట్టింది. ఆలోచన దశ నుంచి ప్రోటోటైప్ (నమూనా దశ) వద్ద కార్యకలాపాలు కొనసాగిస్తున్న స్టార్టప్‌లకు అవసరమైన సహకారాన్ని అందించేందుకు టీ హబ్ వేదికగా రూబ్రిక్ యాక్సిలరేటర్‌ను ఏర్పాటు చేసింది. ప్రోటోటైప్ దశ నుంచి మినిమమ్ వయబుల్ ప్రొడక్ట్ దశ (ఎంవీపీ) వరకు ఆయా స్టార్టప్‌లకు ఈ కార్యక్రమం ద్వారా అవసరమైన సహయ సహకారాలను అందిస్తామని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు మరిన్ని వివరాలకు ఈ లింక్‌లో (https://bit.ly/3Ratafw) సంప్రదించాలని తెలిపారు.