నీరవ్ మోదీ అప్పగింతకు బ్రిటన్ హోంమంత్రి గ్రీన్ సిగ్నల్

లండన్ : పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ కేసులో నిందితుడు, డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీని భారత్ కు అప్పగించేందుకు బ్రిటన్ హోంమంత్రి ప్రీతి పటేల్ ఆమోదం తెలిపారు. తన అప్పగింతను సవాల్ చేస్తూ బ్రిటన్ లో నీరవ్ మోదీ చేపట్టిన న్యాయపోరాటంలో ఫిబ్రవరి 25న ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. భారత్ లో సరైన దర్యాప్తు జరగదన్న నీరవ్ వాదనను తన 83 పేజీల ఉత్తర్వుల్లో బ్రిటన్ వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్స్ కోర్ట్ తోసిపుచ్చింది.
మరోవైపు కరోనా మహమ్మారితో నీరవ్ మోదీ మానసిక ఆరోగ్యం బాగాలేదని, భారత్ లో మానవ హక్కల ఉల్లంఘనను సాకుగా చూపిన ఆయన తరపు అడ్వకేట్ల వాదననూ కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఇక నీరవ్ కు ఆర్ధర్ రోడ్డు జైలులో బ్యారక్ నెంబర్ 12లో అన్ని సదుపాయాలు కల్పిస్తామని భారత్ హామీ ఇచ్చిందని జడ్జ్ గూజీ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, నీరవ్ మోదీని భారత్ కు అప్పగించేందుకు బ్రిటన్ హోంమంత్రి ప్రీతి పటేల్ ఆమోదముద్ర వేశారని సీబీఐ వర్గాలు వెల్లడించాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Britan
- extradition
- Nirav Modi
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

