Two Wheeler Sales | పండుగల సీజన్‌పైనే టూ-వీలర్స్ ఆశలు.. డబుల్ డిజిట్ గ్రోత్ ఉంటుందని అంచనాలు
Two Wheeler Sales | ఆటోమొబైల్ సంస్థలన్నీ పండుగ సీజన్‌పైనే ఆశలు పెట్టుకున్నాయి. డబుల్ డిజిట్ గ్రోత్ ఉంటుందని ఆశిస్తున్నాయి.
Two Wheeler Sales | కొవిడ్-19 తర్వాత పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం పెరిగింది. జూలై మినహా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకూ ప్రతి నెలా టూ వీలర్స్ సేల్స్ పెరుగుతూ వచ్చాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఫాడా) ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వే ప్రకారం ప్రతి నెలలో టూ వీలర్స్ సేల్స్ గత ఐదు నెలల్లో 61.2 శాతం టూ వీలర్స్ అమ్ముడయ్యాయి. పండుగల సీజన్లో కూడా డబుల్ డిజిట్స్ గ్రోత్ నమోదవుతుందని ఫాడా అంచనా వేస్తున్నది. అదీ కూడా సెప్టెంబర్‌లో కంటే 10 శాతానికి పైగా సేల్స్ రికార్డవుతాయని భావిస్తున్నది.
గత రెండేండ్లతో పోలిస్తే 2022 జూలై-డిసెంబర్ మధ్య లక్ష నుంచి 1.15 లక్షల టూవీలర్స్ అధికంగా అమ్ముడవుతాయని అంచనా. అంటే సాధారణంగా 66-67 లక్షల యూనిట్ల టూ వీలర్స్ అమ్ముడవుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఏడాది ద్వితీయార్థంతో సేల్స్ 12 శాతం పెరిగి 70-75 లక్షల యూనిట్లకు చేరుతుందని భావిస్తున్నారు.
ప్రస్తుతం పండుగల సీజన్.. వచ్చే నవంబర్ 21 నుంచి పెండ్లిండ్ల సీజన్ కూడా మొదలవుతుంది. పండుగలు, పెండ్లిండ్ల నేపథ్యంలో కేర్ ఎడ్జి, క్రిసిల్ వంటి రేటింగ్ సంస్థల అంచనా ప్రకారం గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ద్వితీయార్థంలో లక్ష నుంచి 1.15 లక్షల టూ వీలర్స్ అదనంగా అమ్ముడవుతాయని తెలుస్తున్నంది. గత రెండేండ్లతో పోలిస్తే ఈ ఏడాది టూ వీలర్స్ సేల్స్ డబుల్ డిజిట్స్ గ్రోత్ నమోదు చేస్తాయని ఫాడా అధ్యక్షుడు మనీశ్ రాజ్ సింఘానియా చెప్పారు. అందుకు ఇవీ కారణాలు..!
పలు కంపెనీలు వివిధ టూ వీలర్స్‌పై డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నాయి.
ఎక్స్చేంజ్ బోనస్‌గా రూ.10 వేల వరకు కంపెనీల ఆఫర్
పేమెంట్స్ యాప్, క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులపై రూ.5000 వరకు క్యాష్ బ్యాక్
కాంప్లిమెంటరీ రోడ్ సైడ్ అసిస్టెన్స్
డౌన్ పేమెంట్ డిస్కౌంట్.. బై.. ఆపరేట్.. ఒకవేళ నచ్చకపోతే రిటర్న్స్..
ప్రస్తుత పండుగల సీజన్లో జరిగే టూ వీలర్స్ సేల్స్‌లో 30 శాతానికి పైగా విద్యుత్ వాహనాలు ఉంటాయని టూ వీలర్ సేల్స్ ప్లాట్‌ఫామ్ ఒట్టో సీఈవో సుమిత్ ఛాజెద్ చెప్పారు. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా కొనుగోలు చేసిన టూ వీలర్స్ 24 నెలలు నడిపిన తర్వాత కూడా ఈ-స్కూటర్‌ను రిటర్న్ చేయొచ్చునని తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

