న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: మార్కెట్ రెగ్యులేటర్ సెబీ నుంచి ఇటీవల మ్యూచువల్ ఫండ్ లైసెన్స్ పొందిన జిరోధా అసెట్ మేనేజ్మెంట్ రెండు స్కీముల్ని ప్రారంభించేందుకు సిద్దమవుతున్నది. ఈ మేరకు ముసాయిదా ఆఫర్ డాక్యుమెంట్లను సెబీకి సమర్పించింది. పాసివ్ స్కీముల్ని ప్రవేశపెట్టాలన్న ఫండ్‌హౌస్ నిర్ణయానికి అనుగుణంగా జీరోధా ట్యాక్స్ సేవర్ (ఈఎల్ఎస్ఎస్), నిఫ్టీ లార్జ్ మిడ్‌క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్, జిరోధా నిఫ్టీ లార్జ్ మిడ్‌క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్ స్కీముల్ని ప్రతిపాదించింది. ఈ రెండు స్కీములు నిఫ్టీ లార్జ్ మిడ్‌క్యాప్ 250 ఇండెక్స్‌ను అనుసరించి పెట్టుబడులు చేస్తాయి. వీటిలో ఒకటి రూ.1.5 లక్షల మదుపు వరకూ సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని అందించే ఈఎల్ఎస్ఎస్ స్కీమ్ కాగా, రెండవది సాధారణ డైవర్సీఫైడ్ ఈక్విటీ ఫండ్.