న్యూఢిల్లీ, జనవరి 15: శ్రీరామ్ హౌజింగ్ ఫైనాన్స్.. ట్రూహోమ్ ఫైనాన్స్‌గా మారింది. ఈ మేరకు బుధవారం ఆ సంస్థ ప్రకటించింది. అమెరికాకు చెందిన వార్బర్గ్ పిన్కస్.. శ్రీరామ్ హౌజింగ్ ఫైనాన్స్‌ను ప్రమోట్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే వార్బర్గ్ పిన్కస్, దాని కో-ఇన్వెస్టర్లు (క్యూఐఏ తదితరులు) భాగమైన లావాదేవీ.. ఈ రీబ్రాండింగ్‌కు దారితీసింది. ఇదిలావుంటే ఒప్పందంలో భాగంగా శ్రీరామ్ ఫైనాన్స్ గ్రూప్‌నకు రూ.1,225 కోట్ల పెట్టుబడులు అందాయి.