ముంబై, ఏప్రిల్ 12: మేక్మైట్రిప్ గ్రూపునకు చెందిన రెడ్‌బస్ తాజాగా రైల్వే టిక్కెట్లను బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం ‘రెడ్‌రైల్’ యాప్ సేవలను ఆరంభించింది. గడిచిన రెండేండ్లకాలంలో బస్సు, రైళ్ళ టికెట్లను డిజిటల్ ద్వారా బుకింగ్ చేసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో ఈ నూతన సేవలు ఆరంభించినట్లు రెడ్‌బస్ సీఈవో ప్రకాశ్ సంగం తెలిపారు. ప్రస్తుతం ప్రతిరోజు ఆన్లైన్లో పది లక్షల రైల్ టిక్కెట్లు బుకింగ్ అవుతుండంతో ఈ విభాగంలో పుష్కలంగా అవకాశాలున్నాయని చెప్పారు. వచ్చే మూడు నుంచి నాలుగేండ్లకాలంలో మొత్తం టిక్కెట్ బుకింగ్‌లో ఈ నూతన సేవల వాటా 10-15 శాతం మధ్యలో ఉంటుందని సంస్థ అంచనావేస్తున్నది.