శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Business - Feb 05, 2021 , 23:02:19

20 high net worth వ్య‌క్తుల పీఎఫ్ ఖాతాల మొత్తం రూ.825 కోట్లు

20 high net worth వ్య‌క్తుల పీఎఫ్ ఖాతాల మొత్తం రూ.825 కోట్లు

న్యూఢిల్లీ: రూ.2.5 ల‌క్ష‌లు దాటిన ఎంప్లాయి ప్రావిడెండ్ ఫండ్ (ఈపీఎఫ్‌)పై వ‌చ్చే వ‌డ్డీకి ప‌న్ను వ‌సూలు చేయ‌నున్న‌ట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ చేసిన ప్ర‌క‌ట‌న‌పై అన్ని వ‌ర్గాల నుంచి విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. కానీ ప్ర‌భుత్వ వ‌ర్గాల క‌థ‌నం ప్ర‌కారం దేశంలోని టాప్ 20 మంది హైనెట్ వ‌ర్త్ వ్య‌క్తులు (హెచ్ఎన్ఐ) జ‌మ చేసిన పీఎఫ్ ఖాతాల్లో రూ.825 కోట్లు ఉన్నాయ‌ని స‌మాచారం. ఇలా పీఎఫ్ ఖాతాల‌ను దుర్వినియోగం చేసే వారిపై మాత్ర‌మే అధిక ప‌న్ను వ‌సూలు చేయ‌నున్న‌ట్లు కేంద్ర ఆర్థిక శాఖ వ‌ర్గాలు తెలిపాయి. 45 కోట్ల మందిలో 1.3 ల‌క్ష‌ల మంది స‌బ్‌స్క్రైబ‌ర్లు రూ.కోట్ల‌లో పీఎఫ్ ఖాతాల్లో జ‌మ చేశార‌ని వినికిడి.

దీని ప్ర‌కారం ఒక హెచ్ఎన్ఐ పీఎఫ్ ఖాతాలో రూ.103 కోట్లు, మ‌రో వ్య‌క్తి ఖాతాలో రూ.86 కోట్లు జ‌మ చేసి ఉన్నాయ‌ని ద‌ర్యాప్తులో తేలింది. టాప్ 100 హెచ్ఎన్ఐలు త‌మ పీఎఫ్ ఖాతాల్లో రూ.2000 కోట్లు జ‌మ చేశారు. సాధార‌ణ కేంద్ర ప్రభుత్వోద్యోగులు, సాధార‌ణ పీఎఫ్ స‌బ్‌స్క్రైబ‌ర్ల‌పై.. పీఎఫ్ వ‌డ్డీపై ప‌న్ను భారం ఉండ‌బోద‌ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తెలిపారు. వ్య‌వ‌స్థ‌ను మోస‌గించే వారికి వ్య‌తిరేకంగా ఈ ప‌న్ను విధానం తెచ్చామ‌న్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo