వడ్డీరేట్లను తగ్గించిన బ్యాంకులు.. ఎంసీఎల్ఆర్కు పావు శాతం కోత
వడ్డీరేట్లను మూడు బ్యాంకులు తగ్గించాయి. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్లు(ఎంసీఎల్ఆర్)ని పావు శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఈఎంఐల భారం నుంచి కాస్త ఉపశమనం పొందనున్నారు. వడ్డీరేట్లను తగ్గించిన బ్యాంకుల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పీఎన్బీ, బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ)లు ఉన్నాయి.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19 : వడ్డీరేట్లను మూడు బ్యాంకులు తగ్గించాయి. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్లు(ఎంసీఎల్ఆర్)ని పావు శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఈఎంఐల భారం నుంచి కాస్త ఉపశమనం పొందనున్నారు. వడ్డీరేట్లను తగ్గించిన బ్యాంకుల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పీఎన్బీ, బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ)లు ఉన్నాయి. ఆరు నెలలు, ఏడాది కాలపరిమితి కలిగిన రుణాలపై ఎంసీఎల్ఆర్ని 5 బేసిస్ పాయింట్లు కోత పెట్టినట్టు హెచ్డీఎఫ్సీ ప్రకటించింది.
దీంతో రుణాలపై వడ్డీరేటు 8.65 శాతానికి దిగిరాగా, రెండేండ్ల రుణాలపై వడ్డీరేటు 8.70 శాతం యథాతథంగా కొనసాగుతున్నది. అలాగే పీఎన్బీ తన వడ్డీరేట్లను 5 బేసిస్ పాయింట్ల నుంచి 15 బేసిస్ పాయింట్ల వరకు కోత పెట్టింది. దీంతో ఏడాది కాలపరిమితి కలిగిన రుణాలపై ఎంసీఎల్ఆర్ 8.80 శాతానికి దిగొచ్చింది. వీటితోపాటు బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐవీబీ, బీవోఐలు కూడా వడ్డీరేట్లను 15 బేసిస్ పాయింట్లు తగ్గించాయి. బ్యాంకులు తీసుకున్న తాజా నిర్ణయంతో వ్యక్తిగత, వాహన, గృహ రుణాలపై ఈఎంఐలు తగ్గనున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

