Home Loan | ఇంటి రుణం చెల్లింపు పూర్తయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..!
Home Loan | బ్యాంకు నుంచి తీసుకున్న ఇంటి రుణం పూర్తిగా చెల్లించిన తర్వాత సదరు బ్యాంకు నుంచి కీలక పత్రాలు తీసుకోవడం మరిచిపోవద్దని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
Home Loan | ప్రతి ఒక్కరూ సొంతింటి కల సాకారం చేసుకోవాలని భావిస్తారు. గతంతో పోలిస్తే సొంతింటి కల నిజం చేయడానికి బ్యాంకులు సహకరిస్తున్నాయి. సంబంధిత వ్యక్తి, కుటుంబ సభ్యుల ఆదాయం, సిబిల్ స్కోర్ ఆధారంగా ఇండ్ల రుణాలు మంజూరు చేస్తున్నాయి. అలా మంజూరైన ఇండ్ల రుణాలు త్వరితగతిన చెల్లించడానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. 10 నుంచి 20 ఏండ్ల పాటు ఇంటి రుణం చెల్లింపు పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరూ ఆనందడోలికల్లో మునిగి తేలుతారు. ఈ ఆనందంలో కొన్ని తప్పులు, పొరపాట్లు చేస్తుంటారు. రుణం ఇచ్చిన బ్యాంకుల నుంచి కీలక డాక్యుమెంట్లు తీసుకోవడం మరిచిపోతుంటారు. దీనివల్ల భవిష్యత్లో సమస్యలు ఎదురు కావచ్చు. కనుక రుణ గ్రహీతలు తమ రుణం పూర్తిగా చెల్లించినట్లైతే.. సదరు బ్యాంకు నుంచి తీసుకోవాల్సిన ముఖ్యమైన పత్రాల గురించి తెలుసుకుందామా..!
ఇంటి రుణం మంజూరు చేస్తున్నప్పుడు సంబంధిత ఆస్తి పత్రాలను బ్యాంకు తీసుకుంటుంది. అంటే సంబంధిత రుణ గ్రహీత ఇల్లు తాకట్టులో ఉన్నదని అర్థం. అలా తీసుకున్న రుణం పూర్తిగా చెల్లించే వరకూ సదరు ఆస్తి పత్రాలు బ్యాంకు వద్దే ఉంటాయి. కనుక లోన్ పూర్తిగా చెల్లించగానే, బ్యాంకు సదరు రుణ గ్రహీతకు అసలు పత్రాలు ఇచ్చేస్తుంది. కనుక లోన్ చెల్లింపులు పూర్తయిన తర్వాత ఇంటి అసలు పత్రాలు తీసుకోవడం మరిచిపోవద్దని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.
ఇంటి రుణం పూర్తిగా చెల్లించిన తర్వాత అసలు ఇంటి పత్రాలతోపాటు సంబంధిత బ్యాంకు నుంచి ‘నో డ్యూ సర్టిఫికెట్’ తీసుకోవాల్సి ఉంటుంది. అలా ‘నో డ్యూ సర్టిఫికెట్’ ఇవ్వడం వల్ల సదరు వ్యక్తికి ఆ ఇంటిపై యాజమాన్య హక్కులు కల్పించినట్లవుతుంది.
ఇంటి కొనుగోలుకు రుణం ఇచ్చిన బ్యాంకుకు సదరు ఆస్తిపై హక్కు ఉంటది. కనుక అత్యవసర పరిస్థితులు ఏర్పడినా రుణం పూర్తిగా చెల్లించే వరకూ బ్యాంకు అనుమతి లేకుండా ఆ ఇంటిని అమ్మలేరు. రుణం పూర్తిగా చెల్లించిన తర్వాత బ్యాంకు నుంచి ‘నో అబ్జక్షన్ సర్టిఫికెట్’ పొందితే ఇంటిపై బ్యాంకు తాత్కాలిక హక్కు కల్పిస్తుంది. ఆ తర్వాతే మీరు అవసరమైతే మీ ఇంటిని అమ్ముకోవచ్చు.
ఇక ఇంటి రుణం తీసుకోవడంలో సిబిల్ స్కోర్ కీలకం. రుణం పూర్తిగా చెల్లించిన తర్వాత మీ క్రెడిట్ స్కోర్ అప్ డేట్ అయ్యిందా? లేదా? అన్న సంగతి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మున్ముందు మీరు రుణం పొందడం కష్ట సాధ్యమవుతుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

