Laptops-Tablets | లాప్ టాప్‌లు.. టాబ్ల దిగుమతి నిషేధం నాలుగు నెలలు వాయిదా.. ఎందుకంటే?!
Laptops-Tablets | విదేశాల నుంచి లాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, పర్సనల్ కంప్యూటర్ల దిగుమతిపై నిషేధం కేంద్రం కొంతకాలం వాయిదా వేసేలా కనిపిస్తున్నది.
Laptops-Tablets | విదేశాల నుంచి లాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, ఆల్ట్రా-స్మాల్ కంప్యూటర్లు, సర్వర్ల దిగుమతిపై విధించిన నిషేధంపై కేంద్ర ప్రభుత్వం శుక్రవారం వివరణ ఇచ్చింది. తక్షణం నిషేధం అమలు చేయబోవడం లేదని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్వీట్ చేశారు. ఇప్పటికే కొన్ని ఆర్డర్లు చేసినందున టెక్ కంపెనీలకు నాలుగు నెలల పాటు పరివర్తన కాలం (Transition Period) ఇస్తున్నట్లు తెలిపారు.
లాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, పర్సనల్ కంప్యూటర్ల దిగుమతి నిషేధంపై అమలు చేయడానికి ట్రాన్సిషన్ పీరియడ్ విషయమై త్వరలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నోటిఫికేషన్ జారీ చేస్తుందని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. సెక్యూరిటీతోపాటు మేడ్ ఇన్ ఇండియా పాలసీ కింద దేశీయంగా వాటి తయారీని ప్రోత్సహించడానికి వాటి దిగుమతిపై నిషేధం విధిస్తున్నట్లు గురువారం కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.
ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, పర్సనల్ కంప్యూటర్ల దిగుమతికి లైసెన్సుల కోసం దరఖాస్తు గడువు కూడా మరింత పెంచే అవకాశం ఉందని సమాచారం. దీనివల్ల టెక్ కంపెనీలకు రిలీఫ్ లభిస్తుందని తెలుస్తున్నది. దక్షిణ కొరియా, చైనా నుంచి ఎలక్ట్రానిక్స్, గ్యాడ్జెట్ల దిగుమతిని అడ్డుకోవడమే కేంద్ర ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

