Bank Holidays | 2023లో ఫిబ్రవరి నెల మరో రెండు రోజుల్లో ముగియనున్నది. బుధవారం నుంచి మార్చి నెల ప్రారంభం కానున్నది. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ లావాదేవీలే ఎక్కువ సాగుతున్నా, బ్యాంకులకు వెళుతున్న వారూ ఉన్నారు. మార్చి నెలలో బ్యాంకులో లావాదేవీల కోసం వెళ్లాల్సి వస్తే ఆయా రోజుల్లో సెలవులు ఉన్నాయా? అన్న సంగతి చెక్ చేసుకుంటే.. సెలవులేని రోజు చూసుకుంటే మంచిదని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. దేశవ్యాప్తంగా నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలు జాతీయ సెలవు దినాలు. మరో ఆరు రోజులు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో బ్యాంకులు పని చేయవు. మొత్తం 12 రోజుల పాటు మార్చిలో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.
గుడి పడ్వా.. తెలుగు రాష్ట్రాల్లో తెలుగు సంవత్సరాది లేదా ఉగాది, బీహార్ దివస్, సాజిబు నోంగ్మాపంబా (చిరావ్బా)ల్లో మార్చి 22న బ్యాంకులు పని చేయవు. 30న శ్రీరామనవమి సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ప్రకటించారు. మార్చిలోనే హోలీ పర్వదినం రానున్నది. ఈ పండుగల సందర్భంగా వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఆ సెలవుల జాబితా చూద్దాం..