UPI | గూగుల్ పే, ఫోన్ పేలో మీ డబ్బులు పోయాయా?.. రివర్స్ రావాలంటే ఏం చేయాలి?
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ (యూపీఐ) పరిచయమైన దగ్గర్నుంచి దేశంలో డిజిటల్ లావాదేవీల విప్లవం వచ్చిందనే చెప్పాలి. ఎంతో సౌకర్యవంతమైన, వేగవంతమైన చెల్లింపులు, నగదు బదిలీకి వీలు కలిగింది. అయితే అప్పుడప్పుడు కొన్ని పొరపాట్లతో ఈ యూపీఐ లావాదేవీల్లోనూ ఇబ్బందిపడుతున్న సంఘటనల్ని చూస్తున్నాం.
- గూగుల్ పే, ఫోన్ పేటీఎం తదితర వినియోగదారులు ఏం చేయాలి?
UPI | యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ (యూపీఐ) పరిచయమైన దగ్గర్నుంచి దేశంలో డిజిటల్ లావాదేవీల విప్లవం వచ్చిందనే చెప్పాలి. ఎంతో సౌకర్యవంతమైన, వేగవంతమైన చెల్లింపులు, నగదు బదిలీకి వీలు కలిగింది. అయితే అప్పుడప్పుడు కొన్ని పొరపాట్లతో ఈ యూపీఐ లావాదేవీల్లోనూ ఇబ్బందిపడుతున్న సంఘటనల్ని చూస్తున్నాం. ముఖ్యంగా ఒకరికి బదులుగా మరొకరికి నగదును బదిలీ చేయడం, యూపీఐ ఐడీ, మొబైల్ నంబర్స్ తప్పుగా టైప్ డబ్బు పంపడం, ఇతరత్రా అనధికారిక పేమెంట్స్ ద్వారా నష్టపోవడం వంటివి జరుగుతున్నాయి. ఇలాంటప్పుడు సదరు యూపీఐ లావాదేవీని వెనక్కి తీసుకోవడానికి బాధితులు, నష్టపోయినవారు ఏం చేయాలో చూద్దాం.
నిజానికి క్షణంలో పూర్తయ్యే ఈ యూపీఐ లావాదేవీల్లో ఒక్కసారి నగదు బదిలీ అయిపోతే దాన్ని వెనక్కి తీసుకోవడం చాలా కష్టమే. అందుకే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ ‘యూపీఐ ఆటో-రివర్సల్’ వ్యవస్థను తీసుకొచ్చింది. కానీ దీనిపై కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే మీ యూపీఐ లావాదేవీని రివర్స్ చేయడానికి మీరు విజ్ఞప్తి చేసుకోవచ్చు.
ఇలా చేయండి..
ఒకవేళ మీరు పొరపాటున నగదును పంపించింది బంధువులు, స్నేహితులు లేక తెలిసినవారికో అయితే వారికి కాల్ చేసి జరిగిన విషయాన్ని వివరించండి. ఆ నగదును తిరిగి పంపాల్సిందిగా విజ్ఞప్తి చేయండి.
మీ ప్రమేయం లేకుండా నగదు లావాదేవీ జరిగినట్టు మీ దృష్టికి వస్తే, వెంటనే మీకు ఖాతా ఉన్న బ్యాంక్ శాఖకు, లేదా మీ యూపీఐ సర్వీస్ ప్రతినిధులకు తెలియజేయండి. ఇది చాలాచాలా ముఖ్యమైనదని గుర్తుంచుకోండి. అలాగే లావాదేవీ రిఫరెన్స్ నంబర్, తేదీ, చెల్లించిన మొత్తం వివరాలను బ్యాంక్ ఇవ్వండి. ఆలస్యం చేసినకొద్దీ నష్టపోయే అవకాశాలు పెరుగుతాయన్నది మరువద్దు.
మీ లావాదేవీ షరతులకు లోబడి ఉంటే, మీ బ్యాంక్ లేదా యూపీఐ సర్వీస్ ప్రొవైడర్ (గూగుల్ పే, ఫోన్ పేటీఎం తదితర పేమెంట్ యాప్స్) అంగీకరిస్తే యూపీఐ ఆటో-రివర్సల్ ప్రక్రియ ఆరంభమవుతుంది. అయితే ఇది పూర్తయ్యేందుకు కొంత సమయం పడుతుంది. ఈ ప్రక్రియ పూర్తయితే మీ బ్యాంక్ లేదా యూపీఐ సర్వీస్ ప్రొవైడర్ నుంచి మీకు ధ్రువీకరణ వస్తుంది. ఈ పని విజయవంతమైతే మీ ఖాతాలో సదరు నగదు మొత్తం తిరిగి జమవుతుంది.
చివరగా..
ఎవరికైనాసరే నగదును పంపే ముందు అన్ని వివరాలను నిశితంగా గమనించండి. అలాగే యూపీఐ లావాదేవీ పెండింగ్ లేదా ఫెయిల్ అయినప్పుడు మాత్రమే మీ ఖాతా నుంచి తగ్గిన మొత్తం మళ్లీ తిరిగొచ్చేందుకు అవకాశం ఉంటుంది. విజయవంతమైన లావాదేవీని తిరిగి వెనక్కి తీసుకోలేము. ఇక యూపీఐ పిన్ నంబర్ భద్రంగా ఉంచుకోవాలి. ఎవరికీ తెలియజేయరాదు. తప్పనిసరి పరిస్థితుల్లో మన వాళ్లెవరికైనా పిన్ తెలియజేసినైట్టెతే సదరు లావాదేవీ ముగిసిన వెంటనే ఆ పిన్ నంబర్ మార్చి కొత్తదాన్ని సెట్ చేసుకోవాలి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

