న్యూఢిల్లీ, నవంబర్ 17:దేశీయ మార్కెట్లోకి చౌకైన ఎలక్ట్రిక్ కారు అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఈవీల తయారీ సంస్థ పీఎంవీ ఎలక్ట్రిక్ రూ.4.79 లక్షల విలువైన మైక్రో ఈవీ కారును పరిచయం చేసింది. ఈ ధర తొలి 10 వేల మంది బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు మాత్రమే వర్తించనున్నదని, ఆ తర్వాత బుకింగ్‌లపై ధర అధికంగా ఉంటుందని తెలిపింది. ఇప్పటికే ఈ వాహనం కోసం 6 వేల బుకింగ్‌లు వచ్చాయని, మరో 4 వేలకు మాత్రమే ఈ ధర వర్తించనున్నదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ మోడల్‌తోపాటు మరో రెండు మోడళ్ళను విడుదల చేసింది. వీటి ధర రూ.6.79 లక్షలు, రూ.7.79 లక్షల స్థాయిలో ఉన్నది.