సానుకూల సంకేతాలు
అమెరికా రుణ పరిమితి పెంపు, ఫెడ్ వడ్డీ రేట్ల బాటపై అంచనాలతో గతవారం మార్కెట్ స్వల్పశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనయ్యింది. తుదకు ఎన్ఎస్ఈ నిఫ్టీ 35 పాయింట్ల లాభంతో 18,534 పాయింట్ల వద్ద ముగిసింది.
అమెరికా రుణ పరిమితి పెంపు, ఫెడ్ వడ్డీ రేట్ల బాటపై అంచనాలతో గతవారం మార్కెట్ స్వల్పశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనయ్యింది. తుదకు ఎన్ఎస్ఈ నిఫ్టీ 35 పాయింట్ల లాభంతో 18,534 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం మార్కెట్ అప్‌ట్రెండ్‌కు అవసరమైన పలు సానుకూల సంకేతాలున్నాయని, యూఎస్ డెట్ సీలింగ్‌ను అక్కడి సెనేట్ పెంచడం, ఈ జూన్ సమీక్షలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపునకు బ్రేక్ వేస్తుందన్న అంచనాలు ఏర్పడటం, దేశ వృద్ధి రేటు క్యూ4లో అంచనాలకు మించి పెరగడం వంటివన్నీ ర్యాలీకి దోహదపడే అంశాలేనని విశ్లేషకులు చెపుతున్నారు. అయితే భారత్ సూచీల విలువలు అత్యంత ఖరీదైనవికావడంతో గరిష్ఠస్థాయిలో లాభాల స్వీకరణ జరిగే ప్రమాదం ఉంటుందని జియోజిత్ ఫైనాన్షియల్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ విజయ్‌కుమార్ చెప్పారు. ఈ వారం రిజర్వ్‌బ్యాంక్ ద్రవ్య విధాన సమీక్ష, వచ్చేవారంలో జరిగే ఫెడ్ కమిటీ మీట్ సమీప భవిష్యత్ ట్రెండ్‌ను నిర్దేశిస్తుందని మార్కెట్ నిపుణులు అంటున్నారు.
కీలక మద్దతుస్థాయి 18,459
వచ్చే కొద్ది ట్రేడింగ్ సెషన్లలో నిఫ్టీ 18,887 ఆల్‌టైమ్ గరిష్ఠస్థాయిని బ్రేక్ చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయని విజయ్‌కుమార్ అంచనా వేశారు. గత స్వింగ్ హై అయిన 18,459 పాయింట్ల స్థాయి వద్ద లభించే మద్దతు ఈ వారం నిఫ్టీకి కీలకమని, ఈ స్థాయిపైన నిలిస్తే అప్‌ట్రెండ్ కొనసాగుతుందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ డెరివేటివ్స్ అనలిస్ట్ సుభాష్ గంగాధరన్ చెప్పారు. కానీ 18,459 స్థాయిని కోల్పోతే, కరెక్షన్ జరగవచ్చని అంచనా వేశారు. 18,600పైన స్థిరపడగలిగితే రికార్డు స్థాయిని చేరవచ్చని ఎల్కేపీ సెక్యూరిటీస్ టెక్నికల్ అనలిస్ట్ కునాల్ షా తెలిపారు. 18,400 సమీపంలో మద్దతు లభిస్తున్నదని తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

