న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: యుటిలిటీ వాహనాలకు డిమాండ్ నెలకొనడంతో గత నెలలో ప్యాసింజర్ వాహన విక్రయాలు తొమ్మిది శాతం పెరిగాయని దేశీయ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం(సియామ్) వెల్లడించింది. మొత్తంమీద గత నెలలో 3,59,228 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి. ఏడాది క్రితం ఇదే నెలలో అమ్ముడైన 3,28,376 యూనిట్లతో పోలిస్తే 9 శాతం అధికమని పేర్కొంది.