న్యూఢిల్లీ, మార్చి 15: దేశీయ మార్కెట్లోకి నూతన గ్లాంజా వచ్చేసింది. టయోటా కిర్లోస్కర్ మోటర్ తయారుచేసిన ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ గ్లాంజా రూ.6.39 లక్షల ప్రారంభ ధరతో లభించనున్నది. 1197 సీసీ పెట్రోల్ ఇంజిన్ కలిగిన ఈ మోడల్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో రూపొందించింది. ఐదు-స్పీడ్ మాన్యువల్ రకం మోడల్ రూ.6.39 లక్షల నుంచి రూ.9.19 లక్షల మధ్యలో, ఆటోమేటిక్ ట్రిమ్స్ రూ.7.79 లక్షల నుంచి రూ.9.69 లక్షల మధ్యలో నిర్ణయించింది. ఈ నూతన వెర్షన్ లీటర్ పెట్రోల్‌కు 22 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నది. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు కలిగిన ఈ మోడల్లో ఏబీఎస్(యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), హిల్ హోల్డ్ కంట్రోల్, నలువైపులా కవరేజ్ చేసే కెమెరా, తొమ్మిది అంగుళాల స్మార్ట్ ప్లే కాస్ట్‌తోపాటు పలు ఫీచర్స్ ఉన్నాయి.