Tesla cars | అమెరికాలో తగ్గిన టెస్లా కార్ల అమ్మకాలు.. ధరల్ని తగ్గించి ఆకర్శిస్తున్న మస్క్
Tesla cars | అమెరికాలో టెస్లా కంపెనీ కార్ల ధరలు తగ్గాయి. ధరల తగ్గింపు నిర్ణయంతో కంపెనీ షేర్ కూడా పడిపోయింది. కార్ల అమ్మకాలను పెంచుకోవడానికే ఇలా ధరలు తగ్గించినట్లు తెలుస్తున్నది.
Tesla cars | లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా.. అమెరికాలో తన ఎలక్ట్రిక్ వాహనాల ధరలను తగ్గించింది. వాహనాల అమ్మకాలు నానాటికీ తగ్గుముఖం పట్టడంతోపాటు కంపెనీ స్టాక్స్ పతనం కారణంగా ఎలక్ట్రిక్ వాహనాల ధరలను తగ్గించేందుకు టెస్లా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. టాప్ సెల్లర్ వై-ఎస్‌యూవీతో సహా అనేక కార్ల ధరలు 20 శాతం తగ్గాయి. నానాటికి పడిపోతున్న కార్ల అమ్మకాలను పెంచుకోవడానికి ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు ధరల తగ్గుదల సహకరించే అవకాశాలు ఉన్నాయి. టెస్లా విక్రయాల తిరోగమనం ఇలాగే కొనసాగుతుందని పెట్టుబడిదారులు భయపడుతున్నారు. అలాగే, ఎలాన్ మాస్క్ అస్థిర ప్రవర్తనతో పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు.
రాయిటర్స్ నివేదిక ప్రకారం, గత వారం ఆసియాలో తన వాహనాల ధరలను తగ్గించిన టెస్లా.. ఇప్పుడు అమెరికాతో పాటు యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాలో వివిధ వేరియంట్ల ధరలను తగ్గించింది. ఇది కొన్ని టెస్లా మోడల్లకు కొత్త ఫెడరల్ ట్యాక్స్ క్రెడిట్‌కు అర్హత పొందేలా చేస్తుందని మార్కెట్ పరిశీలకులు భావిస్తున్నారు. ఇది కొనుగోలుదారుల ఆసక్తిని ఆకర్షించడంలో సహాయపడుతుందని కూడా నమ్ముతున్నారు. పలు వెర్షన్ల కార్ల ధరలు తగ్గింపు నిర్ణయంతో శుక్రవారం కంపెనీ షేర్లు 4 శాతం క్షీణించాయి. 2022 ప్రారంభం నుంచి కంపెనీ స్టాక్ 65 శాతం కంటే ఎక్కువ పడిపోయింది.
తన టాప్ సెల్లర్ మోడల్ వై-ఎస్యూవీ వెర్షన్ల ధరలను 20 శాతం వరకు టెస్లా తగ్గించింది. ఈ తగ్గింపు మోడల్ వై మల్టీపుల్ వెర్షన్లకు మార్చి నుంచి 7,500 అమెరికన్ డాలర్లు (రూ. 6.09 లక్షలు) యూఎస్ ఎలక్ట్రిక్ వెహికల్ ట్యాక్స్ క్రెడిట్‌కు అర్హత పొందుతుంది. అతి తక్కువ ఖరీదైన మోడల్ -3 బేస్ ధరను కూడా దాదాపు 6 శాతం తగ్గించడానికి కూడా ఇదే కారణమని చెప్తున్నారు. ధరల తగ్గింపు తర్వాత, మోడల్ వై కేవలం 57,000 అమెరికన్ డాలర్ల (రూ.46.33 లక్షలు) ప్రారంభ ధరకు అందుబాటులో ఉన్నది. దీని ధర అంతకుముందు 70,000 (రూ. 56.89 లక్షలు) అమెరికన్ డాలర్లు. ఇదే సమయంలో టెస్లా అతి తక్కువ ఖరీదైన వాహనం మోడల్-3 ధర 47 వేల (రూ. 38.20 లక్షలు) అమెరికన్ డాలర్ల నుంచి 44 వేల (రూ. 35.76 లక్షలు) అమెరికన్ డాలర్లకు తగ్గిపోయాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

