ప్రపంచంతో స్థానిక పరిశ్రమల్ని కలుపుతాం
రాష్ట్రంలోని స్థానిక పరిశ్రమలను అంతర్జాతీయ సరఫరా గొలుసు (గ్లోబల్ సప్లయ్ చైన్)తో అనుసంధానించేందుకు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకెళ్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.
- రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్ బాబు ఎఫ్టీఏలను సద్వినియోగం చేసుకోవాలని ఇండస్ట్రీకి పిలుపు
హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని స్థానిక పరిశ్రమలను అంతర్జాతీయ సరఫరా గొలుసు (గ్లోబల్ సప్లయ్ చైన్)తో అనుసంధానించేందుకు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకెళ్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా సోమవారం హైదరాబాద్‌లోని టీ-హబ్‌లో నిర్వహించిన ‘మెగా ఎఫ్‌టీఏ అవుట్ రీచ్ ప్రోగ్రామ్’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
భారత్ వివిధ దేశాలతో కుదుర్చుకుంటున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్‌టీఏలు) ద్వారా కొత్త అవకాశాలు లభిస్తున్నాయని, వాటిని స్థానిక పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. మేడ్ ఇన్ తెలంగాణ బ్రాండ్‌తో తయారయ్యే నాణ్యమైన ఉత్పత్తులు ఎఫ్‌టీఏ భాగస్వామ్య దేశాలన్నింటికీ ఎగుమతయ్యేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని వివరించారు.
ఉచితంగా ఏఐ, క్లౌడ్ శిక్షణ
తెలంగాణలోని లక్ష మంది విద్యార్థులకు కృత్రిమ మేధస్సు (ఏఐ), క్లౌడ్ కంప్యూటింగ్ విభాగాల్లో పూర్తిగా ఉచితంగా నైపుణ్య శిక్షణ అందించనున్నట్టు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ఈ మేరకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్), తెలంగాణ అకాడమీ ఫర్ సిల్ అండ్ నాలెడ్జ్ (టాస్) ప్రతినిధులు సచివాలయంలో మంత్రి సమక్షంలో ఎంఓయూ కుదుర్చుకున్నారు. అంతర్జాతీయ ధ్రువీకరణ పరీక్షలు రాసేవారికి రాయితీ వోచర్లు, కోర్సులు విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థుల కోసం టాస్ ప్రత్యేక జాబ్ మేళాలు నిర్వహించి ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని చెప్పారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

