ముంబై, జనవరి 9: నవీ ముంబైలోని తుర్బే వద్ద టెక్నోవా తమ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టచ్ సెంటర్‌ను సోమవారం ప్రారంభించింది. టెక్నోవా ఓపెన్ యూనివర్సిటీ ఫర్ చేంజ్ సంక్షిప్త రూపమే ఈ టచ్ సెంటర్. ఇందులో హెచ్‌పీ ఇండిగో డిజిటల్ ప్రింటింగ్ టెక్నాలజీ పూర్తి అనుభవాన్ని పొందవచ్చని ఈ సందర్భంగా ప్రపంచంలోని అతిపెద్ద ప్రింట్ సొల్యూషన్స్ సప్లయర్స్‌లో ఒకటైన టెక్నోవా తెలియజేసింది. ఇక్కడ హెచ్‌పీ ఇండిగో టెక్నాలజీ, దాని పనితీరుపై ప్రదర్శనలుంటాయి. అలాగే పీఎస్పీలు-బ్రాండ్ల కోసం కొత్త అప్లికేషన్లను (యాప్‌లు) అభివృద్ధి చేస్తారు. అంతేగాక ప్రింట్-ప్యాకేజింగ్ విద్యార్థులతోపాటు ముద్రణ వ్యాపారంలోకి వస్తున్న కొత్త తరాల కోసం తరగతులుంటాయని ఓ ప్రకటనలో టెక్నోవా తెలియజేసింది.
1996లో టచ్ సెంటర్ల ప్రారంభం మొదలైంది. ఇదిలావుంటే టెక్నోవా, హెచ్‌పీ భాగస్వామ్యంపై టెక్నోవా సీఎండీ ప్రణవ్ పారిఖ్ మాట్లాడుతూ.. ‘డిజిటల్ ప్రింటింగ్‌లో టెక్నోవా ప్రయాణం 1993లో మొదలైంది. ఇండిగోతో కలిసి ఆరంభించాం. భారత్‌లో ఇండిగో ప్రెస్‌ల మార్కెటింగ్ కోసం కృషి చేశాం. ఆ తర్వాత ఇండిగో వ్యాపారాన్ని హెచ్‌పీ కొనుగోలు చేయడంతో ఈ సంస్థతో కలిసి సాగుతున్నాం’ అని అన్నారు. కాగా, ఇండిగో ముద్రణా యంత్రాలపై ఫోటోగ్రాఫ్‌ల ఉత్పత్తి కోసం ప్రత్యేక పాలిస్టర్ ఆధారిత నాన్-టియరబుల్ వాటర్-రెసిస్టెంట్ ఫిల్మ్స్‌ను టెక్నోవా అభివృద్ధి చేయడం విశేషం. సిల్వర్ హాలైడ్ పేపర్ ఆధారిత ఫోటోస్ నుంచి డిజిటల్ పాలిస్టర్ ఆధారిత ఫోటోస్‌కు ఫోటో మార్కెట్‌ను మార్చడానికి హెచ్‌పీ సంస్థకు ఈ టెక్నాలజీ ఎంతగానో దోహదం చేసింది.