హైదరాబాద్, మే 20: ఫ్రెంచ్, అమెరికన్, బ్రిటిష్ ఆయిల్ అండ్ గ్యాస్ టెక్నాలజీ దిగ్గజం టెక్నిప్ఎఫ్ఎంసీ.. తమ సాఫ్ట్వేర్ గ్లోబల్ డెలివరీ సెంటర్, ఇంజినీరింగ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ కోసం హైదరాబాద్‌ను ఎంచుకున్నది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన నేపథ్యంలో రూ.1,250 కోట్ల పెట్టుబడులు పెడుతుండగా, తద్వారా ఇక్కడ 3,500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ఈ టెక్నాలజీ సంస్థ కల్పించనున్నది. ప్రపంచవ్యాప్తంగా ఎనర్జీ ఇండస్ట్రీకి సేవలందిస్తున్న ఈ కంపెనీలో రూ.37,000 మంది పనిచేస్తున్నారు. ఎనర్జీ ప్రాజెక్టులు, టెక్నాలజీలు, సర్వీసుల్లో టెక్నిప్ఎఫ్ఎంసీకి ఇండస్ట్రీలో గొప్ప గుర్తింపే ఉన్నది. గ్యాస్, పెట్రోలియం ఉత్పాదక సంస్థలకు ఆఫ్‌షోర్, ఆన్‌షోర్, సబ్‌సీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ సేవలను టెక్నిప్ఎఫ్ఎంసీ అందిస్తున్నది. ఇప్పుడీ సంస్థ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ గ్లోబల్ డెలివరీ సెంటర్, ప్రిసిషన్ ఇంజినీరింగ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఏర్పాటు చేస్తుండటంతో ఇక్కడ ఈ తరహా సర్వీసుల కోసం మరిన్ని పెట్టుబడులు రాగలవన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
సంస్థ : టెక్నిప్ఎఫ్ఎంసీ
ఏర్పాటు : 2017
పరిశ్రమ : గ్యాస్, పెట్రోలియం
ప్రధాన కేంద్రం : హ్యూస్టన్, టెక్సాస్
ఆదాయం : 13.409 బిలియన్ డాలర్లు
నిర్వహణ లాభం : 1.529 బిలియన్ డాలర్లు
ఉద్యోగులు : 37,000