TCS Salary Hike | టీసీఎస్ ఉద్యోగులకు శుభవార్త.. త్వరలో జీతాలు పెంచనున్న సంస్థ..!
TCS Salary Hike | దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్ తన ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త అందించింది. సంస్థలోని ఉద్యోగులకు జీతాలు పెంచాలని యోచిస్తోంది (TCS Salary Hike).
TCS Salary Hike | ఆర్థిక మాంద్యం భయాలతో ప్రస్తుతం ఐటీ రంగం తీవ్ర ఒడిదుడుకుల్లో ఉంది. చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని సంస్థలూ తమ ఉద్యోగులను (employees) ఎడాపెడా పీకి పారేస్తున్నాయి. దీంతో ఐటీ ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తాము పనిచేస్తున్న సంస్థ నుంచి ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సొస్తుందో అన్న భయం నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్ తన ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త అందించింది. సంస్థలోని ఉద్యోగులకు జీతాలు పెంచాలని యోచిస్తోంది (TCS Salary Hike). ఈ మేరకు సంబంధిత వర్గాలు వెల్లడించినట్లుగా ‘బిజినెస్ స్టాండర్డ్’ కథనం ప్రచురించింది.
ఆ కథనం ప్రకారం.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (Tata Consultancy Services ) 2024- 25 ఆర్థిక సంవత్సరంలో సంస్థలో పనిచేస్తున్న ఆఫ్ సైట్ ఉద్యోగులకు (offsite employees) సగటున 7- 8 శాతం వేతనాలు పెంచే ఆలోచనలో ఉంది. అలాగే ఆన్ సైట్ ఉద్యోగులకు (onsite employees) ఈసారి 2- 4 శాతం జీతాలు పెంచనున్నట్లు సమాచారం. ఇదే సమయంలో అద్భుతమైన పని తీరు కనబరిచిన ఉద్యోగులకు ఏకంగా 12- 15 శాతం వరకు వేతనం పెంచనున్నట్లు బిజినెస్ స్టాండర్డ్ తన కథనంలో పేర్కొంది. ఈ వేతన పెంపు ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వస్తుందని తెలిపింది.
Also Read..
Couple Thrashed | షాకింగ్.. ఇంటి ముందు కారు పార్క్ చేశారని దంపతులపై దాడి.. VIDEO
SS Rajamouli | జపాన్‌లో రాజమౌళికి అరుదైన గౌరవం.. ప్రత్యేక గిఫ్ట్ ఇచ్చిన 83 ఏళ్ల వృద్ధురాలు
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

