టీసీఎస్ లాభం రూ.9,478 కోట్లు
- ఆదాయం రూ.52,758 కోట్లు
- 6 లక్షలు దాటిన ఉద్యోగుల సంఖ్య
న్యూఢిల్లీ, జూలై 8: సాఫ్ట్వేర్ దిగ్గజం టీసీఎస్ ఆర్థిక ఫలితాలు విశ్లేషకుల అంచనాల్ని అందుకోలేకపోయాయి. 2022 ఏప్రిల్-జూన్ తొలి త్రైమాసికంలో కంపెనీ నికరలాభం నిరుడు ఇదేకాలం కంటే 5.2 శాతం మాత్రమే వృద్ధిచెంది రూ.9,478 కోట్లకు చేరింది. విశ్లేషకులు ఇది రూ.9,950 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. నిరుడు ఇది రూ.9,008 కోట్లుకన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఆదాయం 16.2 శాతం వృద్ధితో రూ.52,758 కోట్లకు పెరిగింది. గత ఏడాది ఇది రూ.45,411 కోట్లు. శుక్రవారం సమావేశమైన కంపెనీ డైరెక్టర్ల బోర్డ్ రూ.1 ముఖ విలువగల షేరుపై రూ.8 డివిడెండ్‌ను షేర్హోల్డర్లకు సిఫార్సుచేసింది. ఆగస్టు 3న చెల్లించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ చెల్లింపునకు జూలై 16 రికార్డ్ తేదీగా నిర్ణయించారు.
వేతనాల పెంపుతో తగ్గిన మార్జిన్లు
వార్షిక వేతనాల పెంపుదల, వలసల సమస్యతో ఉద్యోగుల్ని అప్‌గ్రేడ్ చేయడంతో సిబ్బంది వ్యయాలు జూన్ త్రైమాసికంలో రూ.25,649 కోట్ల నుంచి రూ. రూ.30,327 కోట్లకు పెరిగాయి. దీంతో నిర్వహణా లాభాల మార్జిన్ 25.5 శాతం నుంచి 23.1 శాతానికి పడిపోయింది. ఈసారి నికరంగా 14,136 ఉద్యోగుల్ని చేర్చుకోవడంతో కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,06,331కు చేరింది. 6 లక్షల మార్క్‌ను అధిగమించడం ఇదే ప్రథమం. మొత్తం సిబ్బందిలో 35.5 శాతం మహిళలున్నారు. వలసల సమస్య కంపెనీని వీడలేదు. జూన్ క్వార్టర్లో 19.7 శాతంగా ఉంది.
‘అన్ని విభాగాల్లో వృద్ధి సాధించి, మంచి డీల్స్ సంపాదించి నూతన ఆర్థిక సంవత్సరాన్ని పటిష్ఠంగా ప్రారంభించాం. మా కొత్త సంస్థాగత వ్యవస్థ క్లయింట్లకు చేరువవుతున్నది. మరిన్ని కాంట్రాక్టులు లభిస్తున్నప్పటికీ, స్థూల అనిశ్చితుల కారణంగా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాం’
-రాజేష్ గోపీనాథన్, టీసీఎస్ సీఈవో
రిటైల్ వర్టికల్లో అన్నింటికంటే అధికంగా 25.1 శాతం వృద్ధి సాధించగా, కమ్యూనికేషన్స్, మీడియాలో 19.6 శాతం, మాన్యుఫాక్చరింగ్లో 16.4 శాతం, బీఎఫ్ఎస్ఐలో 13.9 శాతం వృద్ధి కనబర్చింది.లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్‌లో 11.9 శాతం వృద్ధి జరిగింది.
కంపెనీకి అధిక అదాయాన్ని ఆర్జించిపెట్టే ఉత్తర అమెరికాలో 19.1 శాతం వృద్ధిసాధించింది. యూరప్ వ్యాపారంలో 12.1 శాతం వృద్ధి జరిగింది. ఇండియాలో ఈ వృద్ధి 20.8 శాతంకాగా, ఆసియా పసిఫిక్ ప్రాంతం నుంచి ఆదాయం 6.2 శాతం, లాటిన్ అమెరికా ఆదాయం 21.6 శాతం చొప్పున పెరిగింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Q1 net profit
- tcs
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

