Fixed Diposits | ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీ Fixed Diposits – FD) .. వాటితో ఇన్వెస్టర్లకు రెండు రకాల ప్రయోజనాలు. ఫిక్స్డ్ డిపాజిట్ పథకాల్లో డబ్బు మదుపు చేయడం వల్త పన్ను ఆదా అవుతుంది. మరోవైపు ఫిక్స్డ్ డిపాజిట్లతో ఈక్విటీ మార్కెట్లకు ఎటువంటి సంబంధం ఉండదు. దీనివల్ల స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి, ఒడిదొడుకుల ప్రభావం ఫిక్స్డ్ డిపాజిట్లపై ఉండదు. నికర రిటర్న్స్ (ఆదాయం) లభిస్తుంది.
మ్యూచువల్ ఫండ్స్, ఇతర ఇన్వెస్ట్మెంట్ టూల్స్ మాదిరిగా పన్ను ఆదా ఫిక్స్డ్ డిపాజిట్లకు మార్కెట్ లింక్డ్ రిటర్న్స్‌తో సంబంధం ఉండదు. ఫిక్స్డ్ డిపాజిట్లపై ఖరారు చేసిన వడ్డీరేటు ఆధారంగా గ్యారంటీ రిటర్న్స్ లభిస్తాయి. ఎఫ్డీలపై వచ్చే వడ్డీ సీనియర్ సిటిజన్లకు రెగ్యులర్ ఆదాయంగా ఉంటుంది. పన్ను ఆదా ఫిక్స్డ్ డిపాజిట్ల నిర్ధిష్ట గడువు ఐదేండ్లు ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే ఆదాయం మీద రూ.1.5 లక్షల వరకు ఆదాయం పన్ను చట్టంలోని 80సీ కింద ఐటీ మినహాయింపు పొందొచ్చు.
ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాల ప్రకారం వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్‌లు) మాత్రమే ఫిక్స్డ్ డిపాజిట్ పథకాల్లో డబ్బు మదుపు చేయొచ్చు. సేవింగ్స్ ఖాతా ఉన్న బ్యాంకులోనైనా, మరే ఇతర బ్యాంకులోనైనా ఫిక్స్డ్ డిపాజిట్లు చేయొచ్చు. సేవింగ్స్ ఖాతా ప్రారంభించకుండానే బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లు స్వీకరిస్తాయి. ఎటువంటి సేవింగ్స్ ఖాతా లేకుండా ఫిక్స్డ్ డిపాజిట్లు చేసే ఖాతాదారులు తొలుత నో యువర్ కస్టమర్ ( Know-Your-Customer (KYC) పత్రాలు సమర్పించాలి. కేవైసీ ప్రక్రియ పూర్తి చేయడానికి స్వీయ సంతకాలు చేసిన గుర్తింపు కార్డు (పాన్), చిరునామా గుర్తింపు (పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్) పత్రంతోపాటు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు సమర్పించాల్సి ఉంటుంది. పన్ను ఆదా చేయడానికి చేసే ఫిక్స్డ్ డిపాజిట్లు సంయుక్తంగా కూడా చేయొచ్చు. అయితే ఫస్ట్ ఖాతాదారుకు మాత్రమే వడ్డీ ఆదాయంపై పన్ను ఆదా అవుతుంది.
వివిధ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) పథకాలపై వడ్డీరేట్లు వేర్వేరుగా ఉంటాయి. ఒక బ్యాంకు క్యుములేటివ్ ఇంటరెస్ట్ ఇస్తే, మరో బ్యాంక్ నాన్-క్యుములేటివ్ ఆప్షన్ కల్పిస్తుంది. మీ అసలుపై వచ్చే వడ్డీ ఆదాయం తిరిగి పెట్టుబడి పెట్టడం వల్ల వచ్చే వడ్డీ మొత్తం మెచ్యూరిటీ సమయంలో చెల్లించడమే క్యుములేటివ్ ఆప్షన్. ఫిక్స్డ్ డిపాజిట్లపై నెలవారీగా, త్రైమాసికం, ఆరు నెలలు, ఏడాది ప్రాతిపదికన వడ్డీ చెల్లింపులను నాన్ క్యుములేటివ్ ఆప్షన్‌గా పరిగణిస్తారు. సీనియర్ సిటిజన్లు చేసే ఫిక్స్డ్ డిపాజిట్లపై అధిక ఆదాయం లభిస్తుంది.
డీసీబీ బ్యాంక్ —– ——— 6.6%
ఇండస్ ఇండ్ బ్యాంక్ —- 6.5%
ఆర్బీఎల్ బ్యాంక్ ———– 6.3%
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ —- 6%
కరూర్ వైశ్యా బ్యాంక్ —— 5.9%