టాటా సఫారి డార్క్ ఎడిషన్ లాంఛ్..ధర ఎంతంటే..!

న్యూఢిల్లీ : టాటా మోటార్స్ తన ఫ్లాగ్షిప్ ఎస్యూవీ టాటా సఫారి డార్క్ ఎడిషన్‌ను లాంఛ్ చేసింది. కారు మెకానికల్‌గా యథాతథంగా ఉన్నా కాస్మెటిక్ మార్పులతో పాటు లోపల, వెలుపల బ్లాక్, డార్క్ షేడ్స్‌తో ఆకట్టుకునేలా మలిచారు. డార్క్ ఎడిషన్ ధరలు రూ 19.06 లక్షల నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది.
ఎక్స్ఈ, ఎక్స్ఎం, ఎక్స్‌టి ట్రిమ్స్‌లో డార్క్ ఎడిషన్ అందుబాటులో లేదని తెలిపింది. టాటా సఫారి డార్క్ ఎడిషన్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఇక డార్క్ ఎడిషన్ ఫీచర్లను చూస్తే..గ్రిల్, హెడ్‌లైట్ పరిసరాలు, విండో పరిసరాలు క్రోమ్ స్థానంలో గ్లాసీ బ్లాక్ ట్రీట్మెంట్తో ఆకట్టుకుంటాయి. కారు లోపల బ్లాక్‌స్టోన్ డార్క్ థీంతో డిజైన్ చేశారు.
డ్యాష్‌బోర్డ్ బ్లాక్‌స్టోన్ మ్యాట్రిక్స్‌ను ఇన్సర్ట్ చేశారు. 8.8 ఇంచ్ ఇన్ఫోటెయిన్మెంట్ డిస్ప్లే, వైర్లెస్ యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వైర్లెస్ చార్జర్, 7 ఇంచ్ సెమి డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్, ఎయిర్ ప్యూరిఫైర్, పానోరామిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఆకట్టుకుంటాయి. ఆల్ట్రోజ్, నెక్సన్, నెక్సన్ ఈవీ, హారియర్‌లో కూడా టాటా మోటార్స్ డార్క్ రేంజ్ అందుబాటులో ఉంటుంది
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

