Tata Punch | దేశీయ ఆటోమొబైల్ కంపెనీల్లో టాటా మోటార్స్ ఒకటి.. దేశంలోనే అత్యంత పాపులర్ మోడల్ ఎస్‌యూవీల్లో టాటా పంచ్ కూడా ఉంది. టాటా పంచ్ విషయమై టాటా మోటార్స్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇప్పటి వరకు తయారు చేస్తున్న 10 వేరియంట్ల పంచ్ మోడల్ కార్లను తొలగించనున్నది. వాటి స్థానే క్రియేటివ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, క్రియేటివ్ ఫ్లాగ్ షిప్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, క్రియేటివ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వేరియంట్లను మార్కెట్లో ప్రవేశ పెట్టింది.
డిస్ కంటిన్యూ చేస్తున్న టాటా పంచ్ కార్లలో కామో అడ్వెంచర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, కామో అడ్వెంచర్ రిథం మాన్యువల్ ట్రాన్స్మిషన్, కామో అడ్వెంచర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, కామో అకంప్లిష్డ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, కామో అడ్వెంచర్ రిథమ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, కామో అకంప్లిష్డ్ డాజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, కామో అకంప్లిష్డ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్, కామో అకంప్లిష్డ్ డాజిల్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్, క్రియేటివ్ డ్యుయల్ టోన్, క్రియేటివ్ ఫ్లాష్ షిప్ ఎంటీ డ్యుయల్ టోన్ వర్షన్ వేరియంట్లు ఉన్నాయి.
టాటా పంచ్ క్రియేటివ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ధర రూ.8.85 లక్షలు (ఎక్స్ షోరూమ్), క్రియేటివ్ ఫ్లాగ్షిప్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ రూ.9.60 లక్షలు (ఎక్స్ షోరూమ్), క్రియేటివ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ రూ.9.45 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతాయి. ఇటీవలే టాటా మోటార్స్ తన టాటా పంచ్ కారు ధరలు పెంచేసింది. దీని ప్రకారం వివిధ రకాల వేరియంట్ల ధరలు రూ.17 వేలు పెరిగాయి.
ప్రస్తుతం టాటా పంచ్ కారు ధర రూ.6.13 లక్షల నుంచి రూ.10.20 లక్షల మధ్య (ఎక్స్ షోరూమ్) పలుకుతున్నాయి. హ్యుండాయ్ ఎక్స్‌సెంట్, సిట్రోన్ సీ3, రెనాల్ట్ కైగర్, నిసాన్ మ్యాగ్నైట్, మారుతి సుజుకి ఫ్రాంక్, మారుతి సుజుకి ఇగ్నిస్ మోడల్ కార్లతో టాటా పంచ్ పోటీ పడుతుంది.
2021 అక్టోబర్‌లో టాటా పంచ్ కారు తొలిసారి భారత్ మార్కెట్లో ఆవిష్కరించారు. గతేడాది ఆగస్టులో ట్విన్ సిలిండర్ టెక్నాలజీతో పంచ్ ఐసీఎన్జీ కారు ఆవిష్కరించారు. మైక్రో ఎస్యూవీ కార్ల సెగ్మెంట్లో ట్విన్ సిలిండర్ టెక్నాలజీ ఐసీఎన్జీ కారు ‘టాటా పంచ్’ అత్యంత చౌక. దీని ధర రూ.7.22 లక్షల నుంచి ప్రారంభం అవుతుండగా, కిలో సీఎన్జీపై 26 కి.మీ మైలేజీ ఇస్తుంది. అత్యంత చౌక కారు టాటా పంచ్ ఐసీఎన్జీ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ కలిగి ఉంటుంది.