T Hub | హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 19(నమస్తే తెలంగాణ): టీ హబ్తో తమిళనాడు టెక్నాలజీ హబ్ సంస్థ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో దేశ వ్యాప్తంగా ఆవిష్కరణలను పెంపొందించడానికి, స్టార్టప్ కార్యకలాపాల పురోగతి సాధించడానికి ఇరు సంస్థలు కలిసి పనిచేయనున్నాయని టీ హబ్ ప్రతినిధి తెలిపారు.
యువత ఆలోచనలను వ్యాపార నమూనాగా రూపొందించేందుకు అవసరమైన సాంకేతిక, ఆర్థిక, మార్గనిర్దేశం ఇచ్చేలా రెండు సంస్థలు కలిసి పనిచేయనున్నాయని తెలిపారు.