న్యూఢిల్లీ, అక్టోబర్ 4: ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ.. కస్టమర్లకు కేవలం 10 నిమిషాల్లోనే సర్వీస్‌ను అందించేలా ‘బోల్ట్’ పేరిట ఓ స్పీడ్ ఫుడ్ డెలివరీ సర్వీస్‌ను ప్రారంభించింది. వినియోగదారులకు 2 కిలోమీటర్ల వ్యవధిలో ఉన్న కొన్ని ఎంపిక చేసిన రెస్టారెంట్లలో చేసే ఆర్డర్లకే ఈ సౌకర్యం ఉంటుందని శుక్రవారం సంస్థ ప్రకటించింది. కాగా, రాబోయే వారాల్లో మరిన్ని నగరాలకు ఫుడ్ డెలివరీ సేవలను విస్తరించాలని స్విగ్గీ చూస్తున్నది.
మార్కెట్లోకి లావా అగ్నీ 3 స్మార్ట్‌ఫోన్
న్యూఢిల్లీ, అక్టోబర్ 4: దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్..అగ్నీ 3 స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. రూ.19,999 నుంచి రూ.22,999 ధరల శ్రేణిలో ఈ స్మార్ట్‌ఫోన్ లభించనున్నది. మీడియా టెక్ డిమెన్సిటీ 7300 ఎక్స్ ఆక్టా-కోర్ ప్రాసెసర్, డ్యూయల్ స్క్రీన్, ట్రాక్ స్టెప్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ సందర్భంగా కంపెనీ ఈడీ సునీల్ రైనా మాట్లాడుతూ..రూ.20-25 వేల స్మార్ట్ఫోన్ల విభాగంలో 10 శాతం మార్కెట్ వాటా లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు