Swiggy | మహిళలకు దన్నుగా స్విగ్గీ.. ఎందుకంటే?!
Swiggy | డెలివరీ ఉమన్‌కు ప్రతి నెలా రెండు రోజుల సెలవులు ఇస్తూ నిర్ణయం తీసుకున్నట్లు స్విగ్గీ తెలిపింది.

Swiggy | ఇప్పుడు పురుషులతో సమానంగా మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే, వారు నెలసరి సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. దీని గురించి ఎలా చెబితే.. ఏ విధంగా రియాక్టవుతారోనని బాధపడుతుంటారు. ఈ నేపథ్యంలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ స్విగ్గీ సానుకూల నిర్ణయం తీసుకున్నది. తమ సంస్థలో పని చేసే డెలివరీ ఉమన్‌కు ప్రతి నెలా రెండు రోజుల సెలవులు ఇస్తున్నట్లు తెలిపింది. వారు నెలలో ఎప్పుడైనా రెండు రోజులు సెలవు తీసుకోవచ్చునని స్విగ్గీ ఆపరేషన్స్ వైస్‌ప్రెసిడెంట్ మిహిర్షా తన బ్లాగ్‌లో రాసుకున్నారు.
నెలసరి టైంలో మహిళలు బయటకు రావాలన్నా, రోడ్డుపై తిరగాలన్నా ఇబ్బంది పడుతుంటారు. డెలివరీ సేవల్లోకి రావడానికి వారు వెనుకంజ వేయడానికి ఇదొక కారణం. ఇటువంటి పరిస్థితుల్లో వారికి అండగా నిలవాలని స్విగ్గీ నిర్ణయించుకుందని మిహిర్షా తెలిపారు. అంతే కాదు.. రాత్రి టైంలో డెలివరీ సేవలకు డిమాండ్ ఉన్నా.. సాయంత్రం ఆరు గంటల తర్వాత మహిళలతో ఫుడ్ డెలివరీ నిలిపేస్తున్నామన్నారు.
తొలుత పుణెలో 2016లో స్విగ్గీ డెలివరీ సేవల్లోకి మహిళలను అనుమతించారు. తర్వాతి దశలో దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో మహిళలు స్విగ్గీ డెలివరీ ఉమన్‌గా సేవలందిస్తున్నారు. స్విగ్గీ నిర్ణయం పట్ల నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Hyderabad | ఆఫీస్ స్పేస్‌లో హైదరాబాద్ అగ్రస్థానం
Bullet Doctor : బుల్లెట్ బండి డాక్టర్.. ఈయన స్పెషాలిటీ ఏంటో తెలుసా?
మ్యాట్రిమోనియల్ సైట్లో పరిచయమైన మహిళపై కన్నేసి ఆపై లైంగిక దాడి!
నంబర్ 16 నుంచి ‘ఇండియాజాయ్’.. తెలంగాణ ప్రభుత్వం మద్దతు
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Delivery Woman
- Swiggy
RELATED ARTICLES
తాజా వార్తలు
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

