న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ సుజుకీ మోటర్‌సైకిల్..దేశీయ మార్కెట్లోకి సరికొత్త స్పోర్ట్స్ బైకును పరిచయం చేసింది. 250 సీసీ సామర్థ్యం కలిగిన వీ-స్ట్రోమ్ ఎస్ఎక్స్ ధరను రూ.2.11 లక్షలుగా నిర్ణయించింది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. ఈ బైకుతో సంస్థ 250 సీసీ స్పోర్ట్స్ అడ్వెంచర్ టూర్ సెగ్మెంట్లోకి ప్రవేశించినట్లు అయింది.